Kanyasulkam

గురజాడ అప్పారావు / Gurajada Apparao · Novels

Kanyasulkam book cover

Price: Rs. 180. సాయంకాలమైంది, పూటకూళ్లమ్మకు సంతలో సామాను కొనిపెడతానని నెలరోజుల కిందట యిరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్లు కింద ఖర్చు పెట్టాను, యీవా ళ ఉదయం పూటకూళ్ళమ్మకీ నాకూ యుద్ధవైఁపోయింది. బుఱ్ఱ బద్దలు కొడదామా అన్నంత కోపం వొచ్చింది గాని, పూర్రిచ్చర్డు చెప్పినట్లు పేషెన్సు వుంటే గాని లోకంలో నెగ్గలేం. ఈలా డబ్బు లాగేస్తే యిదివరకు యెన్ని పర్యాయములు వూరుకుంది కాదు. యిప్పుడేదో కొంచం డాన్సింగర్లు మాట ఆచోకీ కట్టినట్టు కనబడుతుంది. ఓర్వలేని వెధవ యెవడైనా చెప్పివుంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే యిటుపైని తిండి పెట్టేటట్టు కానరాదు. యీ వూళ్ళో మరి మన పప్పు వుడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే, వెంకుపంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు యెప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు.

Browse more Telugu books