Kanuvippu
Editor · Best Selling

Price: Rs. 140. పిల్లల కోసం వ్రాయడం ఒక కళ. ఎలా చెబితే పిల్లలకు నచ్చుతుందో, ఏ విధంగా రాస్తే పిల్లల హృదయాలను ఆకట్టుకుంటుందో తెలియడం చాలా ముఖ్యం. నాడి చూసి వైద్యుడు రోగాన్ని కనిపెట్టినట్టు పిల్లల హృదయాలను దోచుకునే అంశాలను తీసుకుని కథాంశాలుగా మలచడం తెలిసిన గొప్ప బాల సాహితీవేత్త నారంశెట్టి ఉమామహేశ్వరరావు మామయ్య. బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నారంశెట్టి మామయ్య కలం నుండి జాలువారిన ఆణిముత్యాల వంటి కథల సమాహారమే కనువిప్పు బాలల కథల సంపుటి. మరింకెందుకు ఆలస్యం? త్వరగా కథా వీధిలోకి ప్రయాణించి కమ్మని అనుభూతులను సొంతం చేసుకోండి. నవంబరు 14, 1964 నాడు విజయనగరం జిల్లా గెడ్డలుప్పిలో జన్మించిన నారంశెట్టి మామయ్య 1500 కి పైగా రచనలను తెలుగు పత్రికలలో రాసారు. 30కి పైగా పుస్తకాలను వెలువరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట పురస్కారం, కొలసాని చక్రపాణి పురస్కారం, మంచిపల్లి సత్యవతి పురస్కారం, సమతారావు పురస్కారం మొదలైన పురస్కారాలెన్నో పొందారు. బాలసాహిత్య పరిషత్ గ్రంథాల పోటీలో 'మేలెరిగిన మనిషి'కి ప్రథమ బహుమతి, తానా నవలల పోటీలో ‘C-తరం కుర్రాడు' నవలకి బహుమతి సహా మరో ఇరవైకి పైగా బహుమతులు వీరి ఖాతాలో ఉన్నాయి.