Kanshi Ram Ela Matladaru....
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 90. దేశవ్యాప్త ఉద్యమ నిర్మాణ క్రమంలో కాన్షీరామ్ చేసిన ప్రసంగాలు ఎంతోమంది బహుజనులను ఎంతో ఉత్తేజానికి గురి చేసాయి. మనువాద రాజకీయాలను ఎండగట్టడంలో, వారి పట్ల మనం ఎటువంటి దృక్పథం అలవర్చుకోవాలో నేర్పిన మహానాయకుడు కాన్షీరామ్. ఈనాడు బహుజన రాజకీయాలను కాన్షీరామ్ దృష్టికోణంతో ఆలోచించడం అనే కొత్త ఒరవడి ప్రారంభమైంది. బాబాసాహెబ్ అంబేడ్కరే లేకపోతే భారతదేశంలో బౌద్ధదమ్మ పునరుద్దరణ ఎలా జరిగివుండేది కాదో, సరిగ్గా అలాగే కాన్సీరామ్ భారతరాజకీయాల్లోకి ఒక డైనమేట్లా రాకుండా వుండి వుంటే అంబేడ్కర్ రాజకీయ సిద్ధాంత బలమేమిటో మనకు ఎప్పటికీ తెలిసి వుండేది కాదు. ఆయన ఉపన్యాసాలు వింటూంటే ఫూలే, సాహు, అంబేడ్కర్ భావజాలాన్ని ఆయన ఆకళింపు చేసుకున్న తీరు, దాన్ని దేశ రాజకీయాల్లో బహుజనుల ప్రయోజనాలకు అన్వయించిన తీరు చూస్తే ఆయనెంతటి లోతైన సామాజిక శాస్త్రవేత్తో మనకు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని రుచి చూపించాడు కాన్షీరామ్. అధికారంలోకి వస్తే బహుజనులను ఎలా బాగుచేయవచ్చో, మహానీయుల కలల సాకారం ఎలా ఆచరణీయం చేయవచ్చు.చేసి చూపిస్తున్న ఘనత కాన్షీరామ్ వారసురాలు బెహెన్ మాయావతిది. ఆ స్పూర్తి ఇవాళ భారతదేశ మంతా అన్ని రాష్ట్రాలలో రావాల్సి వుంది. కాన్షీరామ్ చూపిన దారిలో ఎంతోమంది బహుజన యువత ఈనాడు బహుజన రాజకీయోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. బహుజన రాజకీయోద్యమం బలంగా తయారయి బహుజనులు రాజ్యాధికారం సాధించాలంటే బహుజన సాహిత్యోద్యమం కూడా అంతే బలమైన పాత్ర పోషించాల్సిన అవసరం వుంది. ఈ సామాజిక బాధ్యతను సమాంతర వినమ్రంగా స్వీకరించి మహానీయుల పోరాటాలను, త్యాగాలను ఉపన్యాసాలు, వ్యాసాలు, ఇలా అన్ని రూపాల్లో బహుజన ఉద్యమకారులకు అందించే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. మాన్యశ్రీ కాన్షీరామ్ చేసిన ఈ ఉపన్యాసాలు ఎంతో సమాచారాన్ని ఇచ్చేవిగాను, మనువాద రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఒక దిక్సూచిలా పనిచేస్తాయని మేము భావిస్తున్నాం.