Kannayya Vadalo Kreeneedalu

Editor · New Arrivals

Kannayya Vadalo Kreeneedalu book cover

Price: Rs. 65. ఇందిరా గోస్వామి ప్రముఖ అస్సామీ రచయిత్రి 1942, నవంబరు 14వ తేదీన జన్మించారు. అస్సామీలో సుమారు డజను నవలలు, వందలకొద్దీ కథలు రచించారు. అనేక పురస్కారాలు అందుకున్న ఇందిరా గోస్వామి 'మమరె ధారా తరోవల్ ఆరు దుకాన్ ఉపన్యాస'కు 1982లో సాహిత్య అకాడమీ అవార్డు, 2000లో జ్ఞానపీఠ్ అవార్డు పొందారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఇందిరా గోస్వామి రచనల ఆధారంగా పలు నాటకాలు, సినిమాలు రూపొందాయి. 'అడజ్య' అనే చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా జూహ్ను బారువా దర్శకత్వంలో వర్డ్స్ ఫ్రం ది మిస్ట్' అనే సినిమా వచ్చింది. ఆమె రచనలు అనేకం ఆంగ్లంతోపాటు హిందీ తదితర భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. విద్యార్థినిగా ఉన్నపుడే ఆమె తొలి కవితా సంపుటిని వెలువరించారు. ఆమె డిల్లీ విశ్వవిద్యాలయంలో అస్సామీస్ విభాగానికి అధిపతిగా పనిచేశారు. ఆమె 2011 నవంబరు 29న మరణించారు. పాలకోడేటి కృష్ణమూర్తి పుట్టింది వీరవాసరం, పశ్చిమగోదావరి జిల్లా. పెరిగింది, చదివింది భాగ్యనగరంలో, 1972లో జ్యూడీషియల్ డిపార్టుమెంటులో ఉద్యోగప్రవేశం. 2000లో హైకోర్టు కార్యాలయం జుడికేచర్ లో డిప్యూటీ రిజిస్ట్రార్గా ఉద్యోగ విరమణ. చిన్నతనంలో అంటే 1960లో మల్లేపల్లి నుంచి వెలువడిన 'ఆటపాటలు' మాసపత్రిక నిర్వహించిన 'సినిమా' వ్యాసరచన పోటీలో ఏకైక బహుమతిగా వచ్చిన పారితోషికం ఐదు రూపాయల నోటు ఇప్పటికీ నా మదిలో రెపరెపలాడుతూనే ఉంది. 'బంధం' కథాసంపుటి, 'ప్రతిధ్వని' అనువాద కథాసంపుటి, తాజాగా 'కంచ ఐలయ్య' నవల 'అంటరాని దేవుడు' అనువాదం ప్రచురితం.

Browse more Telugu books