Kanchelapai dehaalu (కంచెలపై దేహాలు)
Editor · Best Selling

Price: Rs. 180. ఈ వ్యాసాలు విద్వేషం, కరుణ, విచారం, దుఃఖం, కష్టం, ప్రతిఘటన, సామాజిక న్యాయం, సౌహార్ద్రత, అవకాశాలు, అర్ధాలపై వ్యాస పరంపర. భారతదేశాన్ని ఈ మధ్యకాలంలో ఓ కుదుపు కుదిపిన బాధాకరమైన సంఘటనలను రచయిత, తన దృష్టికోణం నుంచి చూసి రాసినవి లోతుగా పరిశీలించి చెప్పిన మార్గదర్శక పుస్తకం ఇది. ఈనాడు మనమున్న భయంకర స్థితి నుండి బయటపడే మార్గాన్నిచూపే దారి దీపం. - అరుంధతి రాయ్, గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్ రచయిత్రి శక్తివంతమైనది. బ్రహ్మ ప్రకాష్ కథ చెప్పిన తీరు అందంగా ఉంది. భారతదేశంలో మహిళలు, పురుషులు, పిల్లలు రోజువారీ ఎదుర్కొంటున్న కంచెలను వర్ణించిన పద్ధతి బాగుంది. కాస్తంత విరామాలు ఇచ్చి పుస్తకాన్ని పూర్తిగా చదవండి. పదాలను అర్థం చేసుకోండి. కోపం తెచ్చుకునేందుకు సిద్ధపడండి. - సంతోష్ దాస్, లండన్లో అంబేద్కర్, రచన సహ రచయిత, సహ సంపాదకుడు తీరిక ఆలోచనలను రేకెత్తించింది. కానీ గందరగోళంగా ఉన్నకాలంలో సశరీరత తత్వజ్ఞానం బోధించింది. అణచివేతను ఎదుర్కొంటున్న వారిని కంచెల దగ్గరగా చూసి గడిపిన రోజుల్లో నేర్చుకున్న పాఠాలు గ్రంథాలయాల్లో ఏళ్ళ తరబడి నేర్చుకున్న పాఠాల కన్నా గొప్పవి. - ప్రొ॥ గజాల జమీల్, జె.ఎన్.యు. కవిత్వం, పాండిత్యం, శక్తివంతంగా కలగలసిన పుస్తకం ఇది. కంచెలపై దేహ రాజకీయ పోరాటాలను తెలిపింది. జరిగిన సంఘటనలను నాటకీయంగా చూపించి ఉన్నత కులాల శక్తివంతమైన అణచివేతకు కులం, లింగం మతం ఆధారంగా మనుషులు ఎలా బలవుతున్నారో రాజ్యం యొక్క వివరించింది. - ప్రొ॥ నివేదిత మీనన్, జె.ఎన్.యు. రాజకీయం, విచార వ్యక్తీకరణ, నిరసనలు వ్యక్తపరిచే దేహాల గురించి అద్భుతంగా చిత్రించిన పుస్తకం ఇది. ఊపిరి ఆడకపోవడం, మెడలు వంచడం, తోళ్ళు వలిచేయడం, కవుల గొంతులు వినిపించకుండా చేయడం నుండి ఆవుల కడుపుల్లో నుంచి ప్లాస్టిక్ బయటికి తీయడం వరకు సమకాలీన రాజకీయ అంశాలను ఈ పుస్తకం తడిమింది. అదే సమయంలో మానవ దేహాల్లో మౌలికంగా ఉండే రక్తమాంసాలు, కన్నీళ్ళ గురించి అద్భుతంగా రాయబడింది ఇందులో. - అన్నీ జాయి, పేలుడే టోల్ రయోట్ రచయిత్రి సమకాలీన దేశ పరిస్థితుల్లోని సంస్కృతి గురించి కంచ