Kallola Bharatham

Editor · History

Kallola Bharatham book cover

Price: Rs. 250. రాచపుండయి అఖండాన్ని ఖండితం చేసింది మౌఢ్యం. లక్షలాది భూమి పుత్రులు గూళ్లు లేని దిక్కులేని పక్షులై ఎంత దూరం ఎక్కడ ప్రప దొరికేను? ఎవరు విదిల్చేరు పిడికెడు మెతుకులు? దోసెడు నీళ్లు పెరికివేయగా కాందిశీకులై లక్షల మంది వ్యధార్థులు అవమానాన్ని అసహ్యాన్ని గొంతులో నిలిపి బిడ్డలను కోల్పోయి. సంపదలను కోల్పోయి, స్వత్వాన్ని కోల్పోయి వీధుల్లో, మైదానాల్లో, గుడారాల్లో సంలీనమైనారు. రాచపుండు శస్త్ర చికిత్సకైనా లొంగనే లేదు. నరనరాలా వ్యాధి చేరుతున్నది. చావులను మోస్తూనే ఉన్నది భిన్నాంగమైనా శేషాంగమైనా రక్షకు నోచుకోలేదు. చరిత్ర చేసిన పాపం వల్ల కణకణమూ విషదిగ్ధమైంది. కృత్రిమంగా నిర్మించి సరిహద్దులలో కళేబరాల కందకాలు మంచుకొండల్లో కురుస్తూంది నిరంతరాగ్ని వర్షం. ఎంతవరకు ఈ సంక్షోభం ? ఎవరి కొరకు ఈ అనువాకం? ప్రాణలతలు చిగురించని మరుభూమి ఈ దేశం. మట్టిని పంచుకున్నా, మనుషుల్ని ముక్కలుగా చీల్చినా తుదకు నష్టమైంది మానవీయ జీవన సంస్కృతి. జీవన తత్త్వాన్ని సనాతనంగా తీర్చిన పరమార్థ దృక్పథం చిన్నమస్తయైంది. , సహస్రాబ్దాల ఆత్మ విశ్వాసం స్వాతంత్య్ర రథం రక్తపు బురదలో దిగబడిపోయింది. పర ప్రాభవం దూరం నుంచి మనను పరిహసిస్తూనే ఉంది. అక్షతలు వేయడం మరచిన ఆకాశంలోని ఋషిగణం శాంతి సూక్తం గద్గద కంఠంలో నుంచి వెలువరించలేకున్నది. అర్ధరాత్రి చతుష్షష్ట్యం చక్ర వైజయంతిని ఎత్తింది మహానుభావుడు కాదు -పరాజితుడు, ప్రకంపితుడు. త్రయస్త్రం శత్కోటి గళాల జయరామంలో అపశ్రుతులు. 'ఆయన' మాత్రం ఎక్కడో హింసల కారడవిలో ఒక్కడు తన కళ్ల ముందే తన ప్రతిఫలనం ఖండితమై ఎదలో దాచుకున్న చిరు దీపానికి స్నేహం కరువై అశోచ్య శోకం ఎరుగని ఆత్మవేదియైనందున రాముడు తోడుగా అశరీరుడై సాగిపోతున్నాడు.

Browse more Telugu books