Kalebadu / కలెబడు

Janardhan Rao Hazari / జనార్థన రావు హజారి · Stories & Poetry

Kalebadu / కలెబడు book cover

Price: Rs. 95. ప్రకృతి నిత్యనూతనంగా వికసిస్తుంది. పాతది ఎపుడు కనుమరుగైందో మనకు తెలియదు. కాలం తీరిపోతూ ప్రకృతి తన ఆనవాలును భవిష్యత్తుకు అందిస్తూ రావడం వల్లే మనమీ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాం. నీటి ప్రవాహాల పరవళ్లు, పక్షుల కిలకిలలను చేపల మిలమిలలను చూస్తున్నాము. ప్రకృతిలో భాగమైన మానవులు భాషనేర్చారు. భావాలను వ్యక్తం చేసే ప్రక్రియలను రూపొందించుకున్నారు. రాజులు తమ ఆనవాల్లను గుడులు, కోటలు, చెరువులు, రహదారుల నిర్మాణంలో వదిలి వెళ్లారు. తన తర్వాతి తరాలకు తన ఆనవాల్లు వదిలి మానవులు కాలం చూపుతుంటారు. తన దంటూ ఏదో ఒక ఆనవాలుండాలని కోరుకోవడం సహజం. అది ప్రకృతి ధర్మం. కాళోజీ జీవితమంతా ప్రజలకే అంకితం చేశారు. తన ఆనవాలుగా తన సాహిత్యాన్ని తన కాలపు భావాలను మనకు మిగిల్చిపోయారు. సుద్దాల హనుమంతు, రామసింహ కవి, సి. నారాయణరెడ్డి, అలిశెట్టి ప్రభాకర్, గూడ అంజయ్య, వట్టికోట ఆళ్వారు స్వామి, మేర మల్లేశం, గద్దర్, శిసాగర్ తమ ఆనవాల్లను సమాజానికి అందించి సాగిపోయారు. కళలు సాహిత్యంలో తన ఆనవాల్లే తన వారసులు. తన వారసత్వాన్ని కొందరు సాహిత్యంలో నిలుపుకుంటారు. తర్వాతి తరం వాటిని అందుకుంటారు. ఎనిమిది పదుల పరిణతి వయసులో తన భావాలకు ఒక రూపం ఇవ్వాలనుకున్నారు జనార్ధనరావు హజారిగారు. అవి వారి ఆనవాల్లుగా నిలిచిపోతాయి. అలా ఆనవాల్లుగా నిలిచిపోయే భావాలు, సూక్తులు, సూచనలు, ఎన్నో ఈ గ్రంథంలో వున్నాయి. ఇందులో లలిత గీతాలుగా మలచగలిగే కవితలు, పదిమందిలో వినిపిస్తే రాణించే కవితలు, పిల్లలు సైతం అర్థం చేసుకునే వచన కవితలు ఉన్నాయి.

Browse more Telugu books