Kalatheetha Vyaktulu
Editor · Best Selling

Price: Rs. 230. డాక్టర్ పి శ్రీదేవి రాసిన ఈ నవలలో ప్రధానంగా ఉన్నవి నాలుగు పాత్రలు. మేనమామ అదుపాజ్ఞల్లో బతికే వైద్య విద్యార్థి ప్రకాశం, మంచివాడేకానీపిరికివాడు. ఒద్దికగా ఉండే సున్నిత మనస్కురాలు కళ్యాణి. విలాస జీవితాన్ని గడుపుతున్నా సందర్భం వచ్చినప్పుడు అండగా నిలబడే వ్యక్తి కృష్ణమూర్తి. ఇక నాలుగోది ఎక్కువ చర్చకు గురయ్యే పాత్ర ఇందిర. చిన్నప్పుడే తల్లి మరణించడం. తండ్రి బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్ల చిన్న ఆఫీస్ లో టైపిస్ట్ గా జీవితంలో రాటు దేలిన పాత్ర ఈమెది. ఆత్మ విశ్వాసం, స్వార్థం, ఈర్ష్య, జిత్తులమారితనం అన్నీ ఈ పాత్రలో కనపడతాయి. పరస్పర భిన్న వ్యక్తిత్వాలు గల ఇందిర, కళ్యాణి పాత్రల ప్రయాణాన్ని ఈ నవల ఆవిష్కరిస్తుంది. ఆధునిక స్త్రీ తాను స్వతంత్రురాలినని పేరుతో మోయాల్సి వస్తున్న బరువును దింపుకునే పరిస్థితి లేకపోవడం కూడా ఇందిర పాత్రద్వారా రచయిత్రి చూపిస్తుంది. ఈ నవల "చదువుకునే అమ్మాయిలు" అనే పేరుతో సినిమాగా వచ్చింది... రాయడం లో గొప్ప ప్రతిభ చూపించి, మూడు పదుల వయసులో మరణించిన ఈ రచయిత్రి (1929-61) కూడా కాలాతీత వ్యక్తే!'