Kalapadhalu

Editor · Books

Kalapadhalu book cover

Price: Rs. 200. డా. మల్లెగోడ గంగాప్రసాద్ విద్యార్థిగా ఉన్నప్పుడే అతడిలో పరిశోధనా దాహాన్ని గమనించాను. ఆ దిశగా అడుగువేయమని ప్రోత్సహించాను. తను చేసిన 'కవిత్రయ భారతం కాలస్పృహ' పరిశోధనకు మా యూనివర్సిటీ అందించే ఉత్తమ పరిశోధన (గోల్డ్ మెడల్) అవార్డు వచ్చింది. ఆ పరిశోధనకు కొనసాగింపుగా కాలం మీద ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నాడు. 2022 'కాల దృక్పథం' పేరుతో ప్రాచీన తెలుగు సాహిత్యంలో కాలాన్ని పరిశోధించి అందరి మన్ననలు పొందాడు. ఇప్పుడు 'కాల పదాలు' పేరుతో ఒక నిఘంటువును తీసుకువస్తున్నారు. ఇంకా చాలా మంచి మంచి పరిశో ధనలు చేసి తెలుగు సాహిత్యానికి, భాషకు, పరిశోధనకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఇలా ఒక శబ్దాన్ని ఆశ్రయించి నిఘంటువును నిర్మించడం ఇది ప్రథమం (నాకు తెలిసినంత వరకు). విద్యార్థులకు భాషాధ్యయన పరులకు ఇది మంచి కరదీపిక. పరిశోధకులు దీనిని స్ఫూర్తిగా తీసుకొని వారి వారి రంగాలలో నిఘంటువును కూర్చినట్లయితే భాషాసేవ చేసినట్లే. డా. మల్లెగోడ గంగాప్రసాద్ గారు ఈ రంగంలో మరింత కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు.

Browse more Telugu books