Kalama Suttam
డి. చంద్రశేఖర్ / D. Chandrasekhar · Books

Price: Rs. 25. "జ్ఞానం వేద ప్రమాణం" అని అంటుంది వైదిక మతం; "ప్రభువునందు కలుగు భయము జ్ఞానానికి తొలి అడుగు" అనేది ఒక బైబిలు సూక్తి; “అస్థిత్వం చైతన్యాన్ని నిర్ణయిస్తుంది" అని కార్ల్ మార్క్స్ అన్నారు. ఇవి, ఆయా చింతనలు లేక వాదాల్లోని జ్ఞానసిద్ధాంతాలను తెలియజేసే సూచికలని చెప్పవచ్చు. ఇదే రీతిలో, గౌతమ బుద్ధుని బోధనల్లో ఒక విస్పష్టమైన, గంభీరమైన జ్ఞానసిద్ధాంతం కనిపిస్తుంది. బుద్ధుని ధర్మంలో గల జ్ఞానసిద్ధాంతాన్ని సూచించే ఒక ఉపదేశం "కాలామ సుత్తం".