Kakatheeyulu

Editor · History

Kakatheeyulu book cover

Price: Rs. 135. క్రీ.శ. తొమ్మిదో శతాబ్ద ప్రాంతంలో రాష్ట్రకూటుల సేనానులుగా తమ రాజకీయ జీవితాన్ని మొదలిడిన కాకతీయులు తెలుగునేల నాలుగు చెరగులను ఒకే గొడుగుకిందికి తెచ్చారు. ఆనాటి నిరంకుశ రాచరిక వ్యవస్థలో అసలు సిసలైన ప్రజాస్వామ్య పాలనకు శ్రీకారం చుట్టారు. కాకతీయులు ప్రారంభించిన నాయంకర వ్యవస్థ తరువాత రాజవంశాలకు అనుసరణీయమైంది. కాకతీయులు ఆనాడు తవ్వించిన చెరువులు ఈనాటికీ తెలంగాణలో సాగునీటి అవసరాలను తీరుస్తూనే ఉన్నాయి. మతాతీత పాలనను అందించిన కాకతీయుల కాలంలో సాహిత్య, సంగీత, నృత్య, శిల్పాదికళలు విలసిల్లాయి. పాలంపేట రామప్పగుడి, హనుమకొండ వేయిస్తంభాల గుడి కాకతీయుల అద్భుత శిల్పరీతులకు నిలువుటద్దాలు. సుమారు రెండువందల ఏళ్లు (క్రీ.శ. 1150-1323) తెలుగు ప్రాంతాన్ని ఏకచ్ఛత్రంగా పాలించిన కాకతీయ సమ్రాట్టులపై పి.వి. పరబ్రహ్మశాస్త్రి వెలువరించిన తొలి ప్రామాణిక గ్రంథం కాకతీయులు.

Browse more Telugu books