Kahanidaan-2 / కహానిదాన్-2
Lakshman Rao Patange / లక్ష్మణ్ రావు పతంగే · Children's Books

Price: Rs. 95. శ్రీ లక్ష్మణారావు పతంగే తెలుగు భాషా సాహిత్య బోధనలో దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం గడించారు. హైస్కూలుతో మొదలైన వీరి సాహిత్యజీవితం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరకు కొనసాగింది. లక్ష్మణారావుగారి మాతృభాష మరాఠీ, హైదరాబాదు నగరంలో విద్యాభ్యాసం వల్ల, ముస్లిమ్ అధ్యాపకుల సాహచర్యం వల్ల ఉర్దూ భాషలో ప్రవేశం సంపాదించారు. వీరికి హిందీ, ఉర్దూ, తెలుగు, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో మంచి ప్రవేశముంది. "చేవెళ్ళుదాసు" పేరిట అతని రచనలు సంకలించారు. "ఫన్నెషాయిరీ" అనే ఉర్దూ ఛందశ్శాస్త్రాన్ని "ఉర్దూకవితారీతులు" అన్న పేరుతో తెనిగించారు. అలాగే ఉర్దూ "జబాన్ వొ కవాయిద్" అనే వ్యాకరణాన్ని "ఉర్దూ వ్యాకరణం" అనే పేరుతో తెనిగించారు. జానపద గేయాలను సేకరించి 'తెలంగాణా జనపదాలు'గా ప్రచురించారు. చేతివృత్తులవారిపై 'తీగ తెగిన వీణ నా తెలంగాణ' అన్న సంపుటిని ప్రకటించారు. 'తెలంగాణ కేకలు' అన్న పేరుతో తెలంగాణ ఉద్యమ కవితల్ని సంకలించారు. 'ఉర్దూ-తెలుగునిఘంటువు', 'తెలుగు-ఉర్దూ నిఘంటువు', 'హిందీ-ఉర్దూ జాతీయాలు సామెతల నిఘంటువు', 'తెలంగాణలో ఉర్దూ బాస', 'తెలంగాణ వాడుక భాషా నిఘంటువు' అనే నిఘంటువులను కూర్చారు. 'యుగనాయిక', 'కర్మ సిద్ధాంతం' అనే గ్రంథాల్ని హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. 'దాస్తానే హాతింతాయి' అనే అరబ్బు వీరుడి కథను 'అరబ్బు వీరుడు హాతిం' అనే పేరుతో తెనిగించారు. హైదరాబాద్ కే అదీబౌ అనే ఉర్దూ పుస్తకాన్ని 'హైదరాబాదు ఉర్దూ సాహిత్యకారులు' అన్న పేరిట అనువదించారు. ఇంకా పత్రికల్లో వ్యాసాలు కవితలు రాశారు. 'హైదరాబాదు నుండి తెలంగాణ దాకా' అనే పుస్తకంలో తన గ్రామీణ జీవనం నుండి హైదరాబాదు జీవనం వరకు సమకాలీన చరిత్రను గతకాలపు చరిత్రతో జోడించి అద్భుతంగా చెప్పారు. ఈ పుస్తకం పిఎస్ తెలుగు యూనివర్సిటీ వారి ద్వారా 2018 సంవత్సరపు ఉత్తమ వచన రచనగా ఎంపిక చేయబడి అవార్డు నివ్వబడినది. వీరి సాహిత్య కృషిని గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం తేది 2-06-2017 రోజున తెలంగాణా రాష్ట్ర మూడవ ఆవిర్భావ దినోత్సవంనాడు వీరిని 'హైదరాబాదు మహానగర ఉత్తమ సాహితీవేత్త' అవార్డు నిచ్చి