Jwalitha Deeksha

Editor · Telangana Literature

Jwalitha Deeksha book cover

Price: Rs. 360. ఖమ్మం జైలులో, హాస్పిటల్లో నేను అనుభవించిన ఘర్షణ, విజయ్ ఆవిష్కరించిన తీరు అచ్చంగా తను నా అంతరంగంలోకి ప్రవేశించి చేసినట్లే ఉంది. సామాజికాంశాల మీద తనకున్న అవగాహన, తను చేసిన విశ్లేషణ విజయ్ లో ఉన్న ఆలోచనాపరుడ్ని నాకు కొత్తగా పరిచయం చేసినయ్ కేసీఆర్ సోషలిస్టు విప్లవాన్ని గురించి జాన్ రీడ్ (John Read) అనే అనే ໖ "Ten days that shook the world" గొప్ప పుస్తకం రచించాడు. విజయ్ తీసుకొచ్చిన ఈ పుస్తకానికి కూడా అంతటి గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉంటుంది. అంపశయ్య నవీన్ మీరు కన్ను మలపకుండా ఏకబిగిన చదవగలిగిన మెటీరియల్, మిమ్మల్ని ఏకాంతంలో సమూహంతో కరచాలనం చేయించే పుస్తకం మీ ముందు ఉంది. కొంత ఉద్వేగానికి, కన్నులు చెమ్మగిల్లే సన్నివేశాలకు సంసిద్ధంగా ఉండి ఈ పుస్తకం తెరవండి. అల్లం నారాయణ ఉడుకుతున్న చరిత్రవెంట ఉరికిండు విజయ్. కన్నీటి పొరలమధ్య ఒక్కొక్క ఘటనను ఒదిగి పట్టుకున్నడు. అగ్ని కణాలవంటి క్షణాలను అక్షరమక్షరం కూడబలుక్కుంటూ రాసిండు. ఈ రచన చదువుతుంటే, తెలంగాణకు ఒక ప్రత్యేక ప్రామాణిక భాష రూపుదిద్దుకోవడానికి అవసరమైన బీజాలు పడుతున్నయనే భరోసా కలుగుతది. దేశపతి శ్రీనివాస్

Browse more Telugu books