Jogini Manjamma

Editor · Biographies & Auto Biographies

Jogini Manjamma book cover

Price: Rs. 75. జోగినిగా మారి జోగిని నృత్యానికి అంతర్జాతీయ స్థాయిని సాధించిపెట్టి, కర్ణాటక జానపద అకాడమి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన మంజమ్మ జోగతి ఆత్మకథ ఇది. మనం రోజూ చూసే ట్రాన్సోజెండర్ల జీవితాలను, వారి మనసులను లోతుగా పరిచయం చేస్తుంది ఈ రచన. చిన్నతనం నుంచే మంజమ్మ అనుభవించిన కష్టాలు, దుఃఖాలు, బతుకుకోసం ఆమెపడ్డ బాధలు, వ్యధల ప్రస్థానాన్ని వివరించే రచన ఇది. ఇది ఒక మంజమ్మ కథ కాదు. సమాజం చేత హేళనగా చూడబడే లక్షలాది ట్రాన్సెండర్ల మనస్సు పొరల్లోకి, హృదయ లోతుల్లోకి సామాన్యుల్ని సాదరంగా తీసుకుకెళ్ళి వారికి అర్ధం చేయిస్తుంది. కన్నడంలో ప్రముఖ రచయిత డాక్టర్ చంద్రప్ప సోబట్టి రాసిన మంజమ్మ జోగతి ఆత్మకథకు రంగనాధ రామచంద్రరావు చేసిన ఈ అనువాదం అమ్మనుడి పత్రికలో ధారావాహికగా వెలువడి ఎంతో మంది పాఠకులను ఆలోచింపజేసింది.

Browse more Telugu books