Jogini
Shanti Prabodha · New Arrivals

Price: Rs. 220. జోగిని నవల మళ్లీ మీ ముందుకొస్తున్నది. నవలా విషయం ఇంకా సమసిపోలేదు. జోగిని వ్యవస్థపై వచ్చిన మొట్టమొదటి నవల. ఇది కేవలం నవల మాత్రమే కాదు, దురాచారాలపై, దుష్టత్వాలపై చేస్తున్న ఉద్యమం కూడా ఇది. మనకు తెలియకుండానే మనం ఎంత కర్కశమైన, భయంకరమైన వివక్షతలు, అసమానతలు, అనాగరిక ఆచరణల మధ్య బ్రతుకుతున్నామో కళ్ళు తెరిపించి చదివించే పరిశోధనాత్మక సృజన ఇది. రచయిత్రి రెండున్నరేండ్ల పరిశ్రమ, సామాజిక చైతన్యం కోసం పనిచేసే దృఢ సంకల్పంతో సృజనాత్మకతను జోడించి చేసిన రచన. అణగారిన స్త్రీలకు చైతన్యాన్ని, ధైర్యాన్ని, ఆసరాను ఇస్తే, ఎలా మారగలదో కూడా చూపించిన నవల 'జోగిని', చాలా సహజమైన సన్నివేశాలతో, పాత్రలతో, సంభాషణలతో నడుస్తుంది రచన. వారి జీవిత చిత్రణ, ఆ వ్యవస్థలో దాగిన పీడనను కళ్లకు కట్టిస్తారు రచయిత్రి. చాలా ఆసక్తిగా పాఠకులు చదివేట్టు రాసిన శాంతి ప్రబోధ గారికి అభివందనలు. పాఠకులు తప్పక చదువుతారని ఆశిస్తూ...