Jeevitha Dharsham
Editor · Novels

Price: Rs. 100. “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4నకనుమూశారు. + జీవితాదర్శం చలంగారి చివరి నవల. 1938 తర్వాత 48 వరకు మరొక నవల వ్రాయలేదు. ఈ పదేళ్ళ కాలంలో చాలా పెద్ద ప్రయాణమే చేశారు. జీవితానికి కావలసిందేమిటి అన్న ప్రశ్నకు సమాధానానికి చేరినట్లు ఈ నవలలో తోస్తుంది. ఈనవలారచననాటికి చలంచేసిన ఒకప్రయాణంపూర్తి అయినట్లే. స్త్రీ పురుషుల స్వభావాల మధ్య, భిన్న అంతరాల మధ్య, వైరుధ్యాలు తారసిల్లకుండా ఒక సమన్వయాన్ని ప్రతిపాదించే ప్రయత్నం ఈ నవలలో కనిపిస్తుంది. చలంగారు దర్శించిన పూర్ణ పురుషుడు దేశికాచారి. స్త్రీకి స్వేచ్ఛను, ప్రశాంతిని, అనుభవాన్నియిచ్చితనను వరింపచేసుకుంటాడు. "జీవితాదర్శం నవలలో కళావైదగ్ధ్యం లేదు కాని, చలం ఏ వైరాగ్య దృక్పథాన్ని చేరుకున్నాడో తెలియచెప్పే రచన. ఆయనలోని స్వేచ్ఛా లాలస చివరకు శాంతిలో స్థితిని పొందాలని చూస్తున్నాయి. ఆ శాంతి కోసమే ఆయన రమణాశ్రమంచేరారు. ఇక్కడికి మూడవదశపూర్తిఅయినది”.