Jeevitam Aarogyamga Aanandamgaa Ardhavantamgaa Sagalante
Editor · Books

Price: Rs. 135. ప్రతిఒక్కరికి జీవితంలో అప్పుడప్పుడు సమస్యలు ఎదురవు తుంటాయి. దాదాపు అన్ని సమస్యలకు సూక్తులలో పరిష్కారములు దొరుకుతాయి. ఎలా అనగా- సూక్తి అంటే ఒక మహానుభావుని జీవిత అనుభవ సారాంశము. అంతేగాక- మన ప్రవర్తన ఎలా వుండాలి? మనలో ఏమి లోపాలు వున్నాయి? వాటిని సవరించుకోవడమెలా? మనల్ని మనం ఉద్ధరించుకోవడమెలా? జీవిత కర్తవ్యం ఏమిటి? ఏమి చేస్తే మన జీవితానికి సార్థకత లభిస్తుంది? మొదలగు విషయాలు సూక్తులలో ఇమిడి వున్నవి. కనుక ఇట్టి సూక్తులు (జీవితనూత్రాలు) సేకరించి, అందరికి అందుబాటులోకి తెచ్చి, అందరి జీవితాలు మరింత ఆనందంగా అర్థవంతంగా సాగడానికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం వ్రాయబడినది. మా గురువుగారు పూజ్యశ్రీ బిక్షమయ్య గురూజీ గారి శ్రీ సత్యసాయి ధ్యానమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన 19 రోజుల ధ్యానయోగ, వ్యక్తిత్వ వికాస శిక్షణలో, మా గురువర్యులు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ గారి పిరమిడ్ స్పిరిట్యువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 40 రోజుల ధ్యాన, వ్యక్తిత్వ వికాస శిక్షణలో మరియు పూజ్యశ్రీ స్వామి చిన్మయానంద, స్వామి వివేకానంద తదితరులు రచించిన పుస్తకాలలో లభ్యమైన కొన్ని వేల సూక్తులలో అతిముఖ్యమైన 256 జీవిత సూత్రాలను ఎంచుకొని ఈ పుస్తకంలో పొందుపర్చనైనది.