Jeevana Saurabham

Yaddanapudi Sulochana Rani / యద్దనపూడి సులోచనా రాణి · Novels

Jeevana Saurabham book cover

Price: Rs. 55. భానుమతి ఈ వార్త నమ్మలేనట్టు గుండెలమీద చెయ్యి వేసుకుంది. ఆమె కళ్ళు విడిలిన పత్తికాయల్లా అయినాయి. వేటగాడి చేతినుంచి వదిలిన బాణంలా భర్త కూర్చున్న పడక కుర్చీ దగ్గరికి వచ్చింది. ఆ కళ్ళలో ఆగ్రహం, విస్మయం విలయతాండవం చేస్తున్నాయి. "ఏమిటండీ! మీరనేది? ఎల్లుండి బ్యాంక్ వాళ్ళు వచ్చి మన ఇల్లు జప్తు చేస్తున్నారా? మన అప్పులు అంత పెరిగిపోయినాయా? ఏమిటీ విపరీతం? మీరనేది నిజమా! లేక నన్ను ఆట పట్టిస్తున్నారా? ఇదేం ఆట? నాకు ఒళ్ళు భగ్గున మండిపోతోంది.” పడక్కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చొని, తాపీగా చుట్ట తాగుతున్న భరద్వాజ భార్య అరుస్తున్న ఈ అరుపులకి భయపడలేదు. ఆయన ఈ ప్రపంచంలో అలా పడక్కుర్చీలో వెనక్కు వాలి ఘంట చుట్ట ముని వేళ్ళతో పట్టుకుని, పొగతాగడం కంటే స్వర్గసుఖం ఇంకేదిలేనట్టు కూర్చొని ఉన్నారు. ఆయన కళ్ళలో నిర్లిప్తత భానుమతికి పిచ్చెక్కించేస్తోంది. తన కాళ్ళకింద బాంబు పేల్చి, తాను విలవిలలాడుతుంటే, భర్త అదేం పట్టనట్టు, తన చుట్టే తనకి సర్వస్వం అన్నట్లు కూర్చోవడం ఒళ్ళంతా కారం రాచి, నిప్పుల మీద దొర్లిస్తున్నంత నరకంగా వుంది.

Browse more Telugu books