Jeevana kalam 2

Editor · Biographies & Auto Biographies

Jeevana kalam 2 book cover

Price: Rs. 135. అంతులేని 'కథకుడు' సినిమా బలహీనత నాటకం. కాని ఆనాటి ఫాల్కే 'హరిశ్చంద్ర' నుంచి తొలినాటి పు ల్లయ్యగారి 'భక్త ప్రహ్లాద' దగ్గర్నుంచి నేటి వరకు ఆ బలహీనత సామాన్య నంగా భారతీయ సినీమాలో రాజ్యమేలుతూవచ్చింది. కాని ఐదు దశాబ్దాల పాటు నాటకీయత' నే సినిమాకి బలమూ, అలంకారమూ, ఆకర్షణా చేసి-వెండితెర మీద విస్తారమైన నాటకాలను రచించిన వెండితెర మేస్త్రీ కె. బాలచందర్. సరిగ్గా 76 సంవత్సరాల కిందట తంజావూరు జిల్లా నల్లమాంగుడి అనే గ్రామంలో 3 ఏళ్ళ కుర్రాడికి నాటకం ఊపిరి. ఊరు మధ్య అరుగు మీద నాటకం వేస్తూంటే వాళ్ళ వాసుకి తెలిసి, నాటకం మధ్యలో స్టేజీ మీదకి వచ్చి కొడుకుని చెవి పట్టుకు తీసుకుపోయి 00 చావగొట్టాడు. అయితే ఆ వ్యసనం కారణంగానే ఆ కుర్రాడు తర్వాతి జీవితంలో జై జాతీయ బహుమతులూ, 13 ఫిలింఫేర్ అవార్డులు, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే ఆవార్డు, కళైమామణి, ఏఎన్నార్ అవార్డు పుచ్చుకుని భారతదేశంలో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుంటాడని ఆయనకి తెలీదు. ఆయన 19 ఏళ్ళకి ఊళ్ళో బడిపంతులయ్యాడు. తర్వాత ఎకౌంటెంట్ జనరల్ ఆధసులో గుమాస్తా ఉద్యోగం. అప్పుడే ఒక నాటక సమాజాన్ని ఏర్పరుచుకుని మొట్టమొదటి నాటకం 'మేజర్ చంద్రకాంత్', రచన, ప్రదర్శన. దరిమిలాను సుందరరాజన్ అనే నటుడు సినిమాలో ఆ పాత్ర వేసి 'మేజర్'ని ఇంటిపేరు చేసుకున్నాడు. ఓ పేరులేని దర్శకుడు రాయ్ పిరందాళ్ వళి పిరుక్కుం' (ఆషాఢమాసం వస్తే దారి అదే దొరుకుతుంది) అనే సినిమా తీసి, అనుకోకుండా బోలెడుడబ్బు సంపాదించి, బాలచందర్ 'నీర్ కుమిళి' అనే వాటకాన్ని చూసి, దాన్ని సినీమాగా తీయాలనుకున్నాడు.

Browse more Telugu books