Jeevana Gamanam / జీవన గమనం

బి.ఎస్. రాములు / B.S. Ramulu · Biographies & Auto Biographies

Jeevana Gamanam / జీవన గమనం book cover

Price: Rs. 990. ఇది పేరుకు నా స్వీయ చరిత్రేకాని కేవలం నా స్వీయ చరిత్రకాదు. ఇది నన్ను నడిపించిన కాలం చరిత్ర, ఇది నేను నడయాడిన నేల చరిత్ర, ఇది నేను ప్రవాహంలో ప్రవాహమై సాగిన ఉద్యమాల చరిత్ర, ఇది నా జీవన గమనంలో ఎందరో సమకాలీనుల, పాత్రధారుల, సూత్రధారుల చరిత్ర, ఇది అనేక ఉద్యమాల భావజాల పరిణామాల చరిత్ర. నాలో సాగిన సంఘర్షణల చరిత్ర, హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి తెలంగాణ ముక్కను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పర్చిన తర్వాత కొడిగట్టిన తెలంగాణ ప్రజల సామాజిక చరిత్ర. సమాజం పరిణామశీలమైనది. సామాజిక పరిణామాలు, సామాజిక విప్లవోద్యమాలు లేకుండా నేను లేను. నాలోని నేను నిజానికి వేసుకొదు. సమకాలీన సామాజిక పరిణామాల సారమే నేను, సామాజిక పరిణామాల చిరునామాయే నా జీవన గమనం, ఆనాటి సంఘటనలు, ఉద్యోగ సంఘాలు, సాంఘిక ఉద్యమాలు, విప్లవోద్యమాలు, ఆనాటి మనుషులు, ఉద్యమకారులు, మానవీయ విలువలు సంస్కృతి నిర్మాణం కోసం సాగిన ప్రస్థానాలు ఇందులో చిత్రించబడ్డాయి. నేను ఒంటరిని కాదు. నేనొక సమూహాన్ని, వేనొక సమాజాన్ని, నేను నాతోపాటు పుట్టి పెరిగిన ప్రపంచాన్ని నేనొక సామాజికవర్గాన్ని. నేనొక మానవీయ స్వరాన్ని, నేనొక మానవీయ ధర్మాన్ని, మానవీయ సమాజ నిర్మాణంకోసం ఏ నిర్మాణం, ఏ సిద్ధాంతం పనికివస్తుందో అని నమ్మినంత కాలం నా జీవితాన్ని అంకితం చేసినవాన్ని, పుట్టి బుద్దెరిగిన 14 ఏటనుంది. నా జీవితం ఆదర్శాల వెంట పరిగెత్తింది. ఆ ఆదర్శాలు మార్గాలు సరిగాలేవని, వాటిని ఔదలదాల్చిన ప్రతినిధులు సరిగాలేకని అర్దాంతరంగా ఆగిపోయినవాన్ని, మరో సత్యం ఉందని పరిగెత్తినవాన్ని, అలా వారివారి సిద్ధాంతాలు వాటి ప్రతినిధులు ఆ సంస్థలు నిర్మాణాలు, ఉద్యమాలు అలాగే కొనసాగుతున్నాయి. నేను మాత్రమే మారాను, అనేక మలుపులు తిరిగాను, అందువల్ల వారిది అదే జీవితమైంది. నాది ప్రయోగమైంది. వారు భక్తిభావనతో సమర్పణ భావనతో, త్యాగాలతో, కమిట్మెంట్ ముందుకు సాగిపోయారు. నా జీవితంలో భాగంగా ఉద్యోగ సంఘాల ఉద్యమాలు, జగిత్యాల జైత్రయాత్ర, సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్ విప్లవోద్యమాలు చిత్రితమయ్యాయి. నా

Browse more Telugu books