Jathi Nethalu

Dr. B.V. Pattabhiram / డా॥ బి.వి.పట్టాభిరామ్ · History

Jathi Nethalu book cover

Price: Rs. 45. ఏ మహనీయుడి చరిత్ర చదివినా, వారి బాల్యంలో ఇంట్లో పెద్దలు కథలు చెప్పేవారనీ, మానవతా విలువలు బోధించేవారనీ, మహాత్ముల చరిత్రలు చెప్పి, ప్రేరణ కల్గించేవారనీ ఉంటుంది. ఇప్పుడు కాలం మారింది. కథలు చెప్పేవారు కంచికి చేరారు. తల్లిదండ్రులిద్దరు ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఇతర వ్యవహారాల్లో పడిపోయారు. సమష్టి కుటుంబాలు సన్నబడిపోయాయి. మరి నేటి బాల బాలికలకు కథలు చెప్పేదెవరు అంటే 'టెలివిజన్' అనే సమాధానం వస్తుంది. మనముందు తరానికి సంబంధించిన మహనీయుల గురించి, వారు అనుసరించిన బాటల గురించి చెప్పేదెవరు? పిల్లలకు అటువంటి వారి గురించి ఒకటిరెండు పాఠాలు పెట్టినా, మళ్ళీ మరొకరు వచ్చి ఆ పాఠాలు తీసేయడం జరుగుతుంది. అందుకే నేటి బాలబాలికలకు ఇటువంటి పుస్తకాల అవసరం ఉందనిపించి ఈ రచనలు చేసాను. వీటికి ప్రేరణ కల్గించినవారిద్దరు; మా నాన్నగారు భావరాజు సత్యన్నారాయణగారు. ఆయన చార్టర్డు ఇంజనీరుగా ఉండేవారు. 93 ఏళ్ళు జీవించారు. రెండవవ్యక్తి ప్రముఖ పాత్రికేయులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర్రావు గారు. ఆయన ఆంధ్రప్రభ వార పత్రికలో ఈ వ్యాసాలు రాయించారు. దాదాపు మూడేళ్ళపాటు 'బాలలకు బంగారుబాట' శీర్షికతో వీటిల్లో కొన్ని వ్యాసాలు ప్రచురించారు. వారికి, పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రభలో ఈ జీవితగాథలు ప్రచురితమవుతున్న సమయంలోనే వేలాది పాఠకులు రాసిన లేఖలు నాలో ఎంతో ప్రేరణ కల్గించాయి. కొన్ని జిల్లాల్లో హెడ్మాస్టర్లు పిల్లలచేత పాఠశాల అసెంబ్లీలో ప్రతి సోమవారం చదివిస్తున్నట్లు. శనివారం దానికి సంబంధించిన మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపినపుడు నాకెంతో ఆనందం కల్గింది. అలాగే కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమ తెలుగు పాఠాల్లో 7,9వ తరగతుల్లో నా వ్యాసాలు ప్రచురించినపుడు నాకు పరమానందం కలిగింది.

Browse more Telugu books