Jatheeyatha Samagratha samasyalu, 75 swathanthryodhyamam, Bharatha Swathanthryodhyamaniki RSS Dhroham, Samajika Nyayam Communist Party
Editor · Politics

Price: Rs. 140. భారతదేశం యావత్తూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. భారత జాతీయోద్యమం ఒక గొప్ప చారిత్రిక పోరాటం. రెండు వందల సంవత్సరాలకు పైగా ఈ భారత ఉపఖండాన్ని ఆక్రమించుకుని, దాని సిరి సంపదలను కొల్లగొట్టిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కబంధహస్తాల నుండి ఈ దేశాన్ని విముక్తి చేసిన ఉద్యమం అది. భగత్సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వీరులు ఎందరో స్వతంత్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. వేల మంది నిర్బంధాలపాలయ్యారు. లక్షలాదిగా ప్రజానీకం మహాత్ముడి పిలుపులనందుకొని ఉద్యమాలబాటలో నడిచారు. ఇందరి అశేష త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ స్వతంత్ర భారతదేశాన్ని నేడు పాలిస్తున్నది బిజెపి, మోడీ-షా ద్వయం. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుచుకుంటూ ఈ దేశ ప్రయోజనాలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల స్వార్ధానికి బలి పెడుతోంది. అమెరికన్ సామ్రాజ్యవాదానికి నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ దేశ స్వావలంబననే దెబ్బ తీస్తోంది. జాతీయత గురించి, దేశభక్తి గురించి ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్. ఎస్. ఎస్) దాని అనుబంధ సంస్థలైన బిజెపి, భజరంగదళ్, విశ్వహిందూపరిషత్, ఎబివిపి వంటివి చేస్తున్న బాకా ప్రచారం విన్నవాళ్లెవరికైనా దేశ స్వాతంత్రోద్యమంలో ఈ ఆర్ఎస్ఎస్-బిజెపి పరివారం అనన్య సామాన్యమైన పాత్ర పోషించి ఉంటారు అని భావిస్తారు. కానీ అలా భావించడం అంటే పప్పులో కాలేయడమే. ఆర్.యన్.యస్ 1925 లోనే ఆవిర్భవించినా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఒక్క ఎన్నదగిన నాయకుడయినా దానికి లేకపోవడం యాధృచ్ఛికం కాదు, ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యవాద వలసపాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమంలో ఆర్.ఎస్.ఎస్ శక్తులు ఏనాడూ భాగస్వామి కాలేదు. పైగా ఆ సంస్థ దాని రూపమైన హిందూ మహాసభ బ్రిటిష్ వారితో అడుగడుగునా కుమ్మక్కయి జాతీయోద్యమానికి తీవ్ర ద్రోహం చేశాయి. జాతీయోద్యమంలో పాల్గొన్న దాని ఒక్కగానొక్క నాయకుడు విడి సావర్కర్ కూడా బ్రిటిష్ వారికి అండర్ టేకింగ్ ఇచ్చి ఉద్యమానికి ద్రోహం చేసి జైలునుండి బయటపడ్డాడు. భారత స్వాతంత్రోద్యమ 75 ఏళ్ళ ఉత్సవాల పేరుతో భారతదేశాన్ని హిందూత్వవాదులు కీర్తిస్తు