Jatheeyatha

Editor · History

Jatheeyatha book cover

Price: Rs. 75. జాతీయవాదం ఏది? కుహనా జాతీయవాదం ఏది? జాతి వ్యతిరేకి ఎవరు? దేశభక్తి అంటే ఏమిటి? ఎవరైనా తమ దేశభక్తిని రుజువు చేసుకునేందుకు జాతీయవాద నినాదాలు ఇవ్వడం ముఖ్యమా? మితవాద పక్షానికి 'భారత్ మాతా కీ జై' ఎందుకంత ముఖ్యం? ఒక స్వతంత్ర దేశపు చట్టాల సంపుటిలో రాజద్రోహం చట్టం ఇంకా ఎందుకు కొనసాగుతూనే ఉంది? ఒక దేశానికి సాంస్కృతిక స్వేచ్ఛ ఎందుకు ముఖ్యం? ఏ రకమైన భారతదేశాన్ని మనం కోరుకుంటున్నాం? ఏ రకమైన భారతీయులుగా ఉండాలని మనం కోరుకుంటున్నాం? ఏ రకమైన దేశాన్ని మన భావితరాలకు వదిలివెళ్ళాలని మనం భావిస్తున్నాం? భారతదేశపు అత్యంత ప్రాథమిక సిద్ధాంతాల్లో ఒకటైన జన్మతః మనకు సంక్రమించిన జాతీయవాదంలో ఈ ప్రశ్నలన్నీ ఇమిడి ఉంది. ఇది ఇరవైఒకటవ శతాబ్దంలో చాలా వేడిగా పోటీపడుతున్న సిద్ధాంతాల్లో ఒకటిగా ఉంది. ఈ గ్రంథంలో సూక్ష్మబుద్ధిగల ఆలోచనాపరులు, రచయితలు భారతీయ జాతీయవాద మూలాలు, స్వభావం, ఆచరణ, భవిష్యత్తుపై నిశ్చలమైన, ప్రమాణికమైన పరిజ్ఞానాన్ని అందజేశారు.

Browse more Telugu books