Janaki vimukti

Ranganayakamma · Novels

Janaki vimukti book cover

Price: Rs. 126. ఈ నవల 3 భాగాలుగా ఉంది. కానీ, ఇది రాయడం ప్రారంభించినప్పుడు - ఇన్ని భాగాలూ, ఇంత కధా, నా దృష్టిలో లేవు. మొదట దీన్ని కొంత వరకే రాశాను. అది, 'ఆంధ్ర జ్యోతి' వార పత్రికలో సీరియల్గా వచ్చింది. తర్వాత అది పుస్తకంగా కూడా వచ్చింది. అప్పుడు దానికి, 1 వ భాగం అనే పేరు లేదు. తర్వాత 2 సంవత్సరాలకు, ఆ కధని ఇంకా పెంచి రాశాను. దానికి '2 వ భాగం' అని పేరు పెట్టాను. దానివల్ల, అంతకు ముందు వున్న కధ, 1 వ భాగం అయింది. 2 వ భాగం కూడా ఆంధ్ర జ్యోతి వార పత్రికలోనే సీరియల్గా ప్రారంభమైంది. అది చివరి వరకూ అలాగే వచ్చి వుంటే, అదంతా కలిసి 2 వ భాగమే అయ్యేది. కానీ, అలా జరగలేదు. అది సీరియల్ నడుస్తూ వుండగా పత్రిక వారు దాన్ని ఒక చోట ఆపేశారు. అప్పుడు, అంత వరకూ వచ్చిన దానికే 2 వ భాగంగా పేరుపెట్టి, దాన్ని పుస్తకంగా తెచ్చాము. ఇంకా మిగిలి వున్నది 3 వ భాగం అయింది. దాన్ని పత్రిక్కి ఇవ్వాలనే తొందర లేకపోవడం వల్ల, ఇంకా ఎక్కువ టైము తీసుకుని దాన్ని మళ్ళీ మళ్ళీ రాశాను. అది, సీరియల్గా గాక, పుస్తకం గానే వచ్చింది. ఈ 3 భాగాలూ వేరు వేరు కాలాల్లో రాసినవి కాబట్టి, ఇవి గతంలో వేరు వేరు పుస్తకాలుగానే వున్నాయి. 3 భాగాల వివరాలన్నిటినీ ఆ పుస్తకాలకు గతంలో రాసిన ముందు మాటల్లోనే చెప్పాను. ఇప్పుడు, 3 భాగాలూ కలిపి ఒకే సంపుటం అవుతున్నాయి. మొత్తం కధ అంతా ఒకే చోట దొరకడం పాఠకులకు ఎక్కువ సౌకర్యంగా వుంటుంది. ఈ సంపుటంలో, 3 భాగాలూ కలిసి వున్నా, స్పష్టత కోసం, ఏ భాగం పేరు ఆ భాగానికి వుంచుతున్నాను. అంటే, ఇక్కడ కూడా 3 భాగాలూ వేరు వేరుగానే వుంటాయి. ఈ భాగాలకు గతంలో రాసిన ముందు మాటల్లోనించే కొన్ని కొన్ని పేరాల్ని ఈ సంపుటంలో కూడా అవసరమైన చోట్ల చేరుస్తున్నాను. ఎక్కడెక్కడంటే, 1 వ భాగానికి చివర్లోనూ; 2 వ భాగానికి మొదట్లో కొంతా, చివర్లో కొంతా; 3 వ భాగానికి చివర్లోనూ ఇలా చేర్చాను. వీటిని చూస్తే, ఈ భాగాలకు సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయి. గతంలో, ఈ భాగాలు వేరు వేరు పుస్తకాలుగా వున్నప్పుడు, 1 వ భాగం 3 ముద్రణలూ, 2 వ భాగం 2 ముద్రణలూ వచ్చిన తర్వాత, ఆ 2 భాగాల్నీ కలిపి ఒకే

Browse more Telugu books