Jana Chandrodayam / జన చంద్రోదయం
గడ్డం మీటి చంద్రమోహన్ గౌడ్ / Gaddam Meethi Chandramohan Gowd · Stories & Poetry

Price: Rs. 180. అభ్యుదయ కవి చంద్రమోహన్గారి మొదటి గేయ సంకలనం ఇది. తన మనసులోని భావాలకు ఉద్యమాల గీటురాయి మీద పదును పెట్టుకుంటున్నాడు. అందుకే తన ఉద్వేగభావాలకు వాహికగా పాటలు ఎంచుకున్నాడు ఈ కవి. చంద్రమోహన్గారు ఎర్రజెండా ప్రస్తావన వస్తే ఉర్రూతలూగిపోతాడు. కదం తొక్కుతున్న జనాన్ని చూస్తే తానే ఎర్రజెండాగా మారిపోతాడు. వెనక తరాల వారి త్యాగమయ జీవితాలను స్మరిస్తే -చంద్రమోహన్ తల వంగి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. సామాజిక రుగ్మతలు ఎదురైతే వాటికి కారణాలు వెతుకుతాడు. కారకులను పసిగడతాడు. వాటిని నిర్మూలించే శక్తులు ఎవరో - తన ఉద్యమ అనుభవం వలన తెలుసుకున్న చంద్రమోహన్ ఆ శక్తులను తన పాటల ద్వారా తట్టి లేపుతాడు. ఉద్యమిద్దాం అంటాడు! - డా. ఏటుకూరి ప్రసాద్ తాళం విరగకుండా వేగం తరగకుండా అలవోకగా పాటను నడిపించాడు చంద్రమోహన్, సాహిత్య ప్రక్రియలలో 'పాట' ప్రత్యేకమైన విద్య. ఆ విద్య చక్కగా నేర్చుకుని అనేకమైన ఇతివృత్తాలు తీసుకుని చాలా గణనీయంగా పాటలు రాశాడు. 'కమ్యూనిస్టులను కదిలించే పాటలు, హ్యూమనిస్టుల కళ్ళు చెమరించే పాటలు మహిళావాద రచయిత్రుల మనసులను కదిలించే పాటలూ, రాసాడు చంద్రమోహన్. - సుద్దాల అశోక్ తేజ చంద్రమోహన్ గౌడ్ అంటేనే సామాజిక చైతన్యానికి మారుపేరు. ఆయన ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వారు. పార్టీ పట్ల విధేయతతో, అంకితభావంతో, ఆత్మాభిమానంతో పని చేసే వ్యక్తి చంద్రమోహన్. సామాన్య కుటుంబంలో జన్మించి, న్యాయవాద వృత్తిలో కొనసాగడంతో పాటు... భారత కమ్యూనిస్టు పార్టీలో క్రీయాశీల పాత్ర పోషించడం అభినందనీయం. ఆయనకు ఊహ తెలిసినప్పటినుండి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలపై, కష్టాల కడగండ్లపై స్పందించే గుణాన్ని నేను దగ్గరుండి చూశాను. పాటలు రాయాలన్న ఆయన ఆలోచనలను గుర్తించి ప్రయత్నించమని ప్రోత్సహించాను. – చాడ వెంకటరెడ్డి పేరులో చంద్రుడిని, పాటల్లో సూర్యుడిని పొదుపుకున్న అక్షర సైనికుడు చంద్రమోహన్దాస్ గౌడ్. వృత్తిరీత్యా నల్లకోటును, ప్రవృత్తిరీత్యా ఎర్రచొక్కాను ధరించి, న్యాయస్థానంలోనూ... ప్రజాక్షేత్రంలోనూ... ప్రజల పక్షాననే నిలబడి శ్రమిస్తున్న జనం మనిషి,