Jalatharu Kalalu
గంటి భానుమతి / Ganti Bhanumathi · Books

Price: Rs. 135. 'కథ అనేది కదలాలి. మనసుని కదిలించాలి. గుండెని తడి చేయాలి. మానవత్వం ఉండాలి. భావోద్వేగాలు ఉండాలి, తాత్త్వికత ఉండాలి' అని చెప్పే భానుమతిగారు, కథకు ముఖ్యంగా శిల్పం, పదాలు, వాక్య నిర్మాణంతో బాటు వస్తువైవిధ్యం ప్రధానంగా వుండాలని ఆమె భావిస్తారు. కొత్త విషయాల గురించి రాసేటప్పుడు భాష, నుడికారం, సంస్కృతి, సంప్రదాయాలను ఆమె దృష్టిలో పెట్టుకుంటారు. సాహితీ సృజనను ఒక సామాజిక బాధ్యతగా భావించే గంటి భానుమతిగారు ఎలాంటి అశ్లీలతకి తావు ఇవ్వకుండా, మానవీయ దృక్పథంతో రచనలు చేస్తారు. ఏడు దశాబ్దాల క్రితం హైదరాబాదు నగరంలో పుట్టి పెరిగిన గంటి భానుమతి గారు మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుకున్నారు. కమలానెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీలో డి. ఫార్మసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ., ప్రైవేట్గా ఎం.ఏ ఇంగ్లీష్ పూర్తి చేసారు. బాల్యంలో పిల్లల కోసం తెప్పించిన చందమామ, బాలమిత్ర వంటి పుస్తకాలను చదువడం తనకి ఓ మంత్రనగరిలో పయనించిన అనుభూతిని కలిగించేదని అంటారామె. జానపద కథలు, సిందాబాద్ సాహసగాథలు, గలివరి ట్రావెల్స్, బేతాళ కథలు, అపూర్వ చింతామణి కథలను చాలా ఆసక్తిగా చదివేవారు. అలాంటి కథలే తానూ రాయాలని అనుకునేవారు.