Jai Beem

Editor · Best Selling

Jai Beem book cover

Price: Rs. 729. జైభీమ్! ఇది రెండు దశాబ్దాల పట్టువిడవని కృషి ఫలితం. ఇది ఉద్యమాల బాటలో ఆశయంగా మొలకెత్తిన స్వప్నం. అది సాకారమైన మధుర క్షణం. ఆశయం ఆచరణ రూపంలో కనిపించినప్పుడు మానవ హృదయంలో కలిగే సహజమైన సంతోషం. భారతదేశ దార్శినికుల్లో ఒకే ఒక దార్శనిక విప్లవకారుడైన బాబాసాహెబ్ అంబేడ్కర్ ఉద్యమ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని బహు ముఖాలుగా అర్థం చేయించే వ్యాస సంపుటి ఇది. 'అంబేడ్కర్ సైద్ధాంతిక తాత్వికతను సామాన్య పాఠకులకు సైతం సులభంగా అర్థం చేయించడం ఈ సంపుటి లక్ష్యం. ప్రముఖ విద్యావంతులు, మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు ఆయా రంగాలలో నిష్ణాతులైన మేధోలోకమంతా అంబేడ్కర్ గురించి చేసిన/రాసిన విశ్లేషణాత్మక రచనలన్నీ ఒకచోటకు చేర్చి ఈ సంపుటిని వెలువరిస్తున్నాం. అంబేడ్కర్ ప్రవచించిన బోధించు, సమీకరించు, పోరాడు అన్న మహా నినాదానికి భూమి బుక్ ట్రస్ట్ ఈ సంపుటిని సమిధగా సవినయంగా అర్పిస్తుంది.

Browse more Telugu books