ITTHU
Editor · New Arrivals

Price: Rs. 90. కవిలాగే కోట్ల వనజాతకు కథరాయనిది గుండె బరువు దిగదు! కల్మషం లేకుండా అచ్చమైన మనిషితనంతో తప్ప మరో రకంగా అలోచించలేని సహజ కథా రచయిత్రి కోట్ల వనజాత! ఈ సంపుటిలో ఏ కథను ముట్టుకున్నా మనిషి తగలకపోడు ఏ సంఘటనను తడిమినామన జీవితానుభవంలోకి వచ్చిందే మనల్ని ఎప్పుడో ఒకప్పుడు నిలదీసిందే అనిపించక మానదు సహజత్వం కోట్ల వనజాత రచనాశైలిలోని నిరలంకారం! మన మధ్య ఇంకా ఎంతోమంది వ్యదార్థజీవుల యదార్థ రోదనలు ఎంత అమానవీయంగా వినిపిస్తున్నాయో ఈ కథలు కళ్లకు కడుతున్నాయి. ఈ వ్యధలు కన్నీళ్లకు దోసిలి పడుతున్నాయి రచయిత్రిగా కోట్ల వనజాతకు ఈ సంపుటి తొలిఅడుగు నాతోపాటు మీరూ ఈ కథల్ని ఆస్వాదించండి! ఏ కథైనా మిమ్మల్ని కదలిస్తే ఆశీర్వదించండి!!