Inti Peratlo Lakshmi Chettu

యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Literature

Inti Peratlo Lakshmi Chettu book cover

Price: Rs. 270. డబ్బు సంపాదించాలంటే - అదృష్టం ఉండాలి. బాగా చదువు ఉండాలి. చాలా తెలివితేటలు కావాలి. ఎవరో గాడ్ ఫాదర్ ఉండాలి. దయా దాక్షిణ్యాలు దూరం పెట్టాలి. కటువుగా ఉండాలి. కొందరినైనా మోసం చెయ్యాలి. లంచాలు పట్టాలి, లేదా లంచాలు పెట్టాలి. నైతిక విలువలు వదులుకోవాలి. సెంటిమెంట్లు ఉండకూడదు. ఆత్మీయుల్ని వదిలేసి రోజుకి 26 గంటలు కష్టపడాలి. * అన్న అభిప్రాయం మీకుంటే అది తప్పు. డబ్బు సంపాదనకి పైవేమీ అక్కర్లేదు. ఒకటే కావాలి. అదేమిటో ఈ పుస్తకంలో ఉంది. డబ్బున్నోళ్ళు అందరూ చెడ్జోళ్ళు. లేనోళ్ళు మంచోళ్ళు. మనసు మంచిదైతే పూరి గుడిసెలో నైనా కలో గంజో తాగి బ్రతకొచ్చు * అన్న అభిప్రాయం మీకుంటే ఈ పుస్తకం చదవటం వల్ల మీకు ఏ ఉపయోగమూ ఉండదు. ఖర్చు పెట్టి కొనటం అనవసరం. ఎవరో దొంగతనంగా కాపీ చేసి పెట్టిన pdf లో చదువుకోవటం మంచిది. తరతరాలుగా పేదరికంలో మగ్గిపోయిన కుటుంబంలో పుట్టటం నీ చేతిలో లేదు. నీతోనే ఒక ధనవంతమైన తరాన్ని ప్రారంభించటం నీ చేతిలోనే ఉంది.

Browse more Telugu books