Inquilab Matam Viplavam pai Bhagat Singh
ఎస్. వినయ్ కుమార్ · Politics

Price: Rs. 225. భగత్సింగ్ లక్ష్యం కేవలం రాజకీయ విప్లవం మాత్రమే కాదు. వేల ఏళ్ళుగా కొనసాగుతున్న సామాజిక వివక్ష కూడ అంతం కావాలని ఆయన కోరుకునేవారు. భగత్సంగ్ గురించి వెలువడిన చాలా పుస్తకాలు ఆయనను ఒక వలస పాలన వ్యతిరేకిగా మాత్రమే చిత్రించాయి. ఇది వాస్తవం కాదు. సమగ్రమూ కాదు. స్వాతంత్య్రానంతర భారతదేశం ఎలా ఉండాలని కూడా ఆయన ఆలోచించి, అధ్యయనం చేసి ఎంతో దార్శనికతను కనబరిచారు. తన కాలంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలపై రాజకీయ, సామాజిక దృష్టితో చాలా రచనలు చేసి మనకందించారు. కులం, మతం, భాష, రాజకీయాలు వంటి పలు అంశాలపై ఆయన రాశారు. జైలులో సైతం ఆయన అధ్యయనాన్ని కొనసాగించారు. భగత్సాంగ్ బహుముఖ వ్యక్తిత్వానికి అద్దం పట్టే ఆయన రచనల సమాహారమే ఈ పుస్తకం.