Inner Engineering

Sadhguru / సద్గురు · Books

Inner Engineering book cover

Price: Rs. 225. ముక్కు మూసుకుంటే ముక్తి లభిస్తుంది". "కళ్ళు మూసుకుంటే కైవల్యం సిద్ధిస్తుంది". ఇలాంటి మాటలు వినడానికి బానే ఉన్నా, నమ్మడానికి కష్టంగానూ, ఆచరించడానికి అసాధ్యంగానూ అనిపిస్తాయి. సద్గురు 'ఇన్నర్ ఇంజినీరింగ్" అలాంటి అర్థంకాని ఆధ్యాత్మికతని బోధించదు. ఉన్నచోటనే ఉండి ఉన్నత స్థానానికి చేరుకోగలిగే జ్ఞానాన్ని అందిస్తుంది. సవివరంగా- సశాస్త్రీయంగా-సోదాహరణంగా, ఆచరణ యోగ్యమైన యోగ సాంకేతికతని, అరటిపండు వలిచి చేతికిచ్చిన చందంగా మన ముందుంచుతుంది. ఆనందాన్ని కొనుక్కునే స్థితిలో ఉన్న మా తరాన్ని ఆనందాన్ని కనుక్కునే స్థితికి తీసుకు వెళుతుంది. - శ్రీ అనంత శ్రీరామ్ గారు ప్రముఖ కవి & గేయ రచయిత. యోగి, ఆత్మజ్ఞాని, దార్శనికుడు, ఈ తరం గురువు అయిన, సద్గురు, విప్లవాత్మకమైన ఈ పుస్తకంలో ఆధ్యాత్మికత, యోగాలతో తన అనుభవాన్ని జోడించి 'ఇన్నర్ ఇంజనీరింగ్' అనే సరికొత్త పరిణామాత్మకమైన భావనను తీసుకు వచ్చారు. . అనేక సంవత్సరాల కృషితో ఆయన రూపకల్పన చేసిన ఈ శక్తిమంతమైన సాధన శరీరం, మనస్సు, బాహ్య అంతర్గత శక్తులను ఒకే దిశలోకి తీసుకు రావడం ద్వారా అంతులేని శక్తిని, అవకాశాలను అందిస్తుంది. 'ఇన్నర్ ఇంజనీరింగ్' సుఖ, సంతోషాలను చేకూర్చుకోవడానికి మీదైన సాఫ్ట్ వేర్.

Browse more Telugu books