INDRA DANASSU EDO RANGU
Editor · Politics

Price: Rs. 65. దక్షిణాఫ్రికా విమోచనోద్యమానికి తొలి పునాది వేసింది భారతీయులే! 19-20 శతాబ్ద మధ్యకాలంలో పొట్టకూటి కోసం దక్షిణాఫ్రికాకు వలస పోయిన భారతీయ శ్రామికులు, వ్యాపారులు తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఆరంభించిన పోరాటమే. నూరేళ్ళలో దేశంలోని శ్వేతేతర జాతుల విమోచనోద్యమంగా విస్తరిల్లింది. ఆ ఉద్యమాన్ని నడిపించిన వారు; నడిచిన వారిలో భారతీయుల సంఖ్య తక్కువ కాదు; వారి త్యాగాలు, ప్రాణార్పణలు కూడా తక్కువ కాదు. వారి చరిత్రను తొలిసారిగా తెలుగులో పరిచయం చేసే ప్రయత్నం ఈ పుస్తకం. ఈ పుస్తక రచయిత పెన్నేపల్లి గోపాలకృష్ణ సీనియర్ పాత్రికేయులు. కళా సాహిత్య సామాజిక విషయాలపై విస్తృతమైన అధ్యయనం చేసిన రచయిత, వ్యాఖ్యాత.