భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు / Indian Constitution Important Articles
బి.ఎస్. రాములు · Caste, Religion & Culture

Price: Rs. 95. భారత రాజ్యాంగ విశిష్టత ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలున్నాయి. భారత రాజ్యాంగం అత్యుత్తమమైన రాజ్యాంగం. ప్రపంచంలో పలు రాజ్యాంగాలను పరిశీలించి వాటిలోని అత్యుత్తమ అంశాలను భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, అందరికి సమాన అవకాశాలు. సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా వెనుకబడిన వర్గాలకు, కులాలకు సమాజ అభివృద్ధి అందుకోవడానికి ప్రత్యేక అవకాశాలు. అందుకు ఆర్టికల్ 14, 15, 16 చేర్చబడ్డాయి. సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు, సమానత్వం సాధించడం రాజ్యాంగం యొక్క లక్ష్యం. సమస్త వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, భాష, ప్రాంత వివక్షతలను, అసమానతలను తొలగిస్తూ భారత రాజ్యాంగం మహెూన్నత ఆదర్శాలను కలిగి ఉన్నది. వాటిని మనం ఆచరణకు తెచ్చుకోవాలి, అందుకు ఉద్యుమించాలి. అడగనిదే అమ్మయినా పెట్టదు. 26 జనవరి 1950కి ముందు మనుషులందరూ సమానం కాదు. భారత రాజ్యాంగం విశిష్టతను ఓబీసీలు, ఎస్సీలు, సరిగ్గా గుర్తించడంలేదు. భారత రాజ్యాంగం మనుషులందరిని సమానం చేసింది, "వన్ మ్యాన్ వన్ వాల్యూ, వన్ ఓట్" (ప్రతి మనిషికి ఒకే విలు. ఒకే ఓటు) అని స్థిరపర్చింది. 26 జనవరి 1950 నుంచి భారత రాజ్యాంగం ద్వారా ఇది తాత్విక భూమికగా నిలిచింది. దాంతో రాజ్యాంగబద్ధంగా మనుషులందరు సమానమయ్యారు. అంతకుముందు మనుషులందరు సమానులు కారు. విభిన్న కులాలుగా, వర్ణాలుగా, వర్గాలుగా, తెగలుగా, జాతులుగా అనేక అసమానతలకు, వివక్షతలకు, వెలివేతలకు, పీడనకు, అణచివేతకు గురయ్యే తత్వశాస్త్రాలు వెలిసాయి. వాటన్నిటిని పూర్వపక్షం చేస్తూ ఆధునిక సమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగం ప్రపంచంలో ఒక గొప్ప రాజ్యాంగంగా ముందుకు వచ్చిన రోజు 26 జనవరి 1950. అందువల్ల భారత రాజ్యాంగానికి ముందు, భారత రాజ్యాంగానికి తర్వాత అనే రెండు దశలుగా చరిత్రను, అధ్యయనం చేయాలి. ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగం చదవడం అవసరం.