Illoka Rajakeeyam

Editor · Politics

Illoka Rajakeeyam book cover

Price: Rs. 180. ఇద్దరు బందీలు! ఆమె పొయ్యి ముందు పొగచూరి పోయింది. వంటింటి గోడల మూలల్లో అంటుకుపోయింది ఆమె చుట్టూ ప్యూపా ఘనీభవించింది కాంతి లేదు, అంతా చీకటే! ఆమె లోపలే బందీ అయిపోయింది. * ఇటు అతను కూడా లివింగ్ రూములో బోన్నాయి మొక్క పక్కనే పేపర్ చదువుతూ సాలెగూడులో చిక్కుకుపోయాడు. కానీ అతనదే వెలుగనుకున్నాడు. సోఫానే సింహాసనమనుకున్నాడు. దాన్నింక వదలలేదు ఆమె చీకటిని గుర్తు పట్టింది! యుగాలుగా ఆమె ప్యుపా బద్దలయేంతగా పెనుగులాడింది. వంటింటి కిటీకీ కుండీలో అతను పెట్టిన క్రోటన్ మొక్క కూడా వంటింటి వేడికి కమిలిపోయింది. ఒకనాడు వొంటరి దుఃఖాన్ని తుడుచుకుని చీకటి రంగుని వదుల్చుకుని రంగుల రెక్కలని తొడుక్కుని ప్యూపా గోడలని బద్దలు చేసుకుని తన తోటని వెతుక్కుంటూ ఆమె ఎగిరిపోయింది! అతను చీకటిని గుర్తు పట్టలేదు ఎందుకంటే అతనే సూర్యున్ని ఆర్పేసేవాడు కాబట్టి ఆమె తనకి దూరంగా వెళ్ళిపోయిన సంగతి కూడా చూడలేని అంధుడై పోయాడు అక్కడే సాలె గూళ్లోబందీ అయిపోయాడు!

Browse more Telugu books