Idupu Kayitam
డాక్టర్ కాసుల లింగారెడ్డి / Dr. Kasula Linga Reddy · Novels

Price: Rs. 95. కాలం పరీక్షకు నిలిపిన దశలను దాటుకంటూ కవిత్వాన్ని సాక్ష్యంగా కాకుంట, సామాజిక లక్ష్యంగా కవిత్వం రాస్తున్న కవి కాసుల లింగారెడ్డి. సేద్యం కుటుంబ నేపథ్యమైనా, వైద్యం ఆయన నేపథ్యమైనా అన్ని దశల్లో కవిత్వమే మాధ్యమం. ఒక 'జలపాత శబ్దంలోకి' నుంచి 'ఎన్నాద్రి' నుంచి ఇయ్యాల్లటి 'ఇడుపు కాయితం' దాకా గాయపడిన అనుభవాల గొంతుకగానే మాట్లాడుతున్న కవి. నందిని సిధారెడ్డి ఇవాల్టి తెలంగాణ కవులందరిలోకి కూడా లింగారెడ్డిది విశిష్ట స్వరం. లింగారెడ్డి కవిత్వం నాలుగైదు విభిన్న అంశాల రసాయనిక సంయోజనంగా రూపుదిద్దుకున్నది. ఇరవైఐదు ఏళ్లకు పైగా కవిత్వం రాస్తూ కవిత్వ నిర్మాణపు మెళకువలు నేర్చుకున్నవారు. ఎంత సన్నిహితమైన దాన్నయినా విమర్శనాత్మకంగా చూడవలసి వుంటుందనీ, ఎంత వ్యతిరేకించేదాన్నయినా మానవీయంగా చూడవలసివుంటుందనీ ఎరుక వున్నవారు. ఎన్.వేణుగోపాల్