Idam Koutilyam...

K. Narasimha Murthy / కె. నరసింహమూర్తి · Economics & Agriculture

Idam Koutilyam... book cover

Price: Rs. 70. కె. నరసింహమూర్తి, బి.ఎస్సి., ఎఫ్.సి.ఏ., ఎఫ్సిఎంఏ. (56) సి.ఏ., ఐ.సి. డబ్ల్యు, ఏ. కోర్సులలో అత్యుత్తమ రాంకులు సాధించిన ప్రతిభావంతుడు. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అకౌంటెన్సీలు వృత్తిలోకి 1983లో ప్రవేశించారు. 45 పరిశ్రమలకు సంబందించిన 150 కంపెనీల కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ సమాచార వ్యవస్థల నిర్మాణంలో పాలుపంచు కున్నారు. అనేక పెద్ద కార్పొరేట్ సంస్థలు నిలదొక్కుకోవడంలో గణనీయమైన పాత్ర వహించారు. కె.నరసింహమూర్తిగారు. వివిధ బాంకులకు ఆర్ధిక సంస్థలకు డైరెక్టరుగా, సభ్యుడుగా, చైర్మన్ గా సేవలందించారు. రాష్ట్ర జాతీయ స్థాయిల్లో దాదాపు 30 ఉన్నత స్థాయి కమిటీలకు చైర్మన్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. 2007లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్స్ ఇండియా సంస్థ నరసింహమూర్తిగారిని సైటేషన్తో సన్మానించింది. ప్రభుత్వ రంగ బాంకుల ఆడిట్ సంస్కరణల అమలు పర్యవేక్షణ కమిటీ సభ్య సమావేశకర్తగా భారత ప్రభుత్వం ఇటీవలే నరసింహమూర్తిగారిని నియమించింది. ఇదం కౌటిల్యం... ఈ మధ్యకాలంలో కొందరు మన సనాతన ధర్మాన్ని తూలనాడుతున్నారు. నాగరికత మనకి బ్రిటిషర్ల మహాప్రసాదం అన్నట్టు, అవాకులు, చవాకులు ప్రచారంలోనికి తెస్తున్నారు. ఇలాంటి విపరీత ధోరణులకు పోయే వారికి మన సనాతన ధర్మం ఔన్నత్యం ఏమిటి, ప్రాచీన కాలంలోనే మన వ్యవస్థలు ఎలా పనిచేశాయి, 350 బిసి లోనే కౌటిల్యుడు ఎలాంటి పరిణతి చెందిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థ మనకు అందించాడు వంటి అంశాలు వివరించి చైతన్య పరిచే ప్రయత్నమే ఈ "ఇదం కౌటిల్యం".

Browse more Telugu books