I Love Money
సురేష్ పద్మనాభన్ / Suresh Padmanabhan · Books

Price: Rs. 157. సురేష్ పద్మనాభన్ చక్కని వక్త, రచయిత, జీవిత శిక్షకుడు, అనుభవం గల సలహాదారు. మనీవర్క్ షాప్తో పాటు ఆశ్చర్యం కలిగించే "సంకల్పసిద్ధి, ఏన్షియంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ లేదా ఆఫ్ లైఫ్" వంటి వర్క్షాప్లకూ ఆయనే స్థాపకుడు. 'ఐ లవ్మనీ, ఆన్లైడ్ 9, ఏన్షియెంట్ సీక్రెట్స్ ఆఫ్ మనీ' పుస్తకాల రచయిత. 'ఐ లవ్ మనీ' పుస్తకం 11 భారతీయ, విదేశీయ భాషలలోనికి అనువదితమై విపరీతంగా అమ్ముడుపోతూ అంతర్జాతీయంగా పేరు సంపాదించింది. ఇటీవలి స్ఫూర్తిదాయక గ్రంథం 'ఆన్ క్లౌడ్ 9' అన్ని ప్రాంతాల్లోనూ సంచలనం సృష్టిస్తూంది. పద్నాలుగేళ్లుగా సురేష్ పద్మనాభన్ ప్రపంచమంతా పర్యటిస్తూ మనీవర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. 'ఓన్లీ ప్రాఫిట్స్' అనే మరో పుస్తకం స్టాక్ మార్కెట్, పెట్టుబడుల ద్వారా ధనాన్నెలా సంపాదించవచ్చు అనేది విషయం- రాబోతున్నది. ఆయన ప్రాచీన భారతదేశపు జ్ఞానాన్ని, ఋషులు, గురువులు, మాస్టర్ల ఆనువంశికతను, వారి బోధనలలోని సమగ్రతను ప్రేమిస్తారు. భారతదేశంలో కాలాతీతజ్ఞానం ఉందనీ, దాన్ని ప్రపంచమంతటా పంచాలనీ నమ్ముతారు. ఈ వేదాంతాన్నే ఆయన రచనలన్నీ ప్రతిఫలింపజేస్తాయి. పర్యటనలు, జనాన్ని కలవటం, రచనావ్యాసంగం ఆయనకెంతో ఇష్టమైనవి. భారతీయుడుగా పుట్టినందుకు ఆయన గర్విస్తారు. భారతదేశ ఘనచరిత్రను, సంస్కృతిని ప్రపంచం గుర్తించి గౌరవించాలనేది ఆయన ఆశయం. లక్షలాది జనాన్ని కలిసి ముఖ్యంగా ధనం, జీవితం, ఆధ్యాత్మికతల విషయంలో వారి చైతన్య స్థాయిని పెంచడం ఆయన లక్ష్యం.