Hyderabad Vishaadam / హైదరాబాద్ విషాదం
డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి / Dr. Enugu Narasimha Reddy · History

Price: Rs. 135. స్వతహాగా ఇంజనీరైన మీర్ లాయక్ అలీ తర్వాత పారిశ్రామికవేత్తగా మారాడు. అనూహ్యంగా డిసెంబర్ 1, 1947న ఆయన హైదరాబాద్ ప్రధానిగా నియమించబడ్డాడు. హైదరాబాద్ ప్రధానిగా నియమించబడేనాటికి ఆయన ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. 1948 సెప్టెంబర్ పోలీసు చర్య అనంతరం ప్రస్తుతం అమృతామాల్ ఉన్న చోట, బేగంపేటలో ఆయన గృహ నిర్బంధం చేయబడ్డాడు. - నరేంద్ర లూథర్ కె. జితేంద్రబాబు సంపాదకత్వంలో డాక్రి వాళ్ళు ప్రచురించిన ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపోయాను. అది మనకు తెలియని మన చరిత్రలా అనిపించింది. ఇందులో రెండు విషయాలు నన్ను ఆకర్షించాయి. ఒకటి - వస్తువు, రెండు - దాన్ని చెప్పిన పద్ధతి. ట్రాజెడీ ఆఫ్ హైద్రాబాద్ లో మొదటి అధ్యాయం 'దేశ విభజన తర్వాత'. ఇది ఒక చేయితిరిగిన కథారచయిత రాసినట్లు ఉంది. - డా॥ ఏనుగు నరసింహారెడ్డి హైద్రాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరగడానికి దోహద పడిన కారణాలను, జరిగిన సంఘటనలను, జరిపిన సంప్రదింపులను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. తెలంగాణ చరిత్రనీ, ప్రత్యేకించి హైద్రాబాద్ చరిత్రనీ అధ్యయనం చేయడానికి ఉపకరిస్తుందీ రచన. - కె.జితేంద్రబాబు మీర్ లాయక్ అలీ ట్రాజెడీ ఆఫ్ హైద్రాబాద్' ఓ విలక్షణమైన రచన. ఆనాటి నిజాం రాష్ట్ర ప్రధానిగా, హైద్రాబాద్ దేశభక్తుడిగా, హైద్రాబాద్ రాష్ట్ర స్వాతంత్య్రం కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన వ్యక్తి. ఆనాటి న్యాయాన్యాయాలను తనదైన తూనికరాళ్ళతో బేరీజు వేసి ఆవేదనతో రాసిన గ్రంథమిది. 1947 ఆగస్టు 15 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు నడిచిన ఉద్విగ్నభరితమైన హైద్రాబాద్ చరిత్రని తెలుసుకోడానికి ఉపకరిస్తుంది. - గుడిపాటి