Hyderabad Swatantrya Samrambham

N. Venugopal / ఎన్. వేణుగోపాల్ · History

Hyderabad Swatantrya Samrambham book cover

Price: Rs. 24. 200 సంవత్సరాల కిందట శ్రీకాకుళంనుంచి తీరప్రాంతం అంతటినీ దత్తమండలాన్నీ, బిరారునీ బ్రిటీషు ఈస్టిండియా కంపెనీకి ధారాదత్తం చేయగా 8 తెలుగు, 5 మరాఠీ, 3 కన్నడ జిల్లాలు హైదరాబాదు సంస్థానంగా మిగిలాయి. ఐనా దేశంలోని 565 స్వదేశీసంస్థానాలలో అతి పెద్దదిదే. టిప్పుసుల్తానుని ఓడించటానికి ప్రథమ భారతస్వాతంత్య్ర సంగ్రామాన్ని అణచివెయ్యటానికి బ్రిటిషు సర్కారుకి బాసటగా నిలచారు నిజాం ప్రభువులు. మిగతా దేశంతో బాటు సంస్థానప్రజలు భాషా, మతవిభేదాలకతీతంగా వాక్, సభా, రాజకీయ స్వాతంత్ర్యాలు కోరుకున్నారు. 1938లో హైదరాబాదు సంస్థానంలో కాంగ్రెసును ఏర్పరచేందుకు ఎదుర్కొన్న ఆటంకాలని యీ పుస్తకం ద్వారా తెలుసుకొంటాం. తోడేలు-మేకపిల్ల కథని నెమరువేసుకొంటాం.

Browse more Telugu books