Hyderabad Swatantrya Samrambham

Editor · Politics

Hyderabad Swatantrya Samrambham book cover

Price: Rs. 55. హైదరాబాద్ రాజ్య చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టాన్ని పరిచయం చేసే అపురూపమైన చిన్న పుస్తకం ఇది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆనాడు జరిగిన ప్రజా ఉద్యమాలను ఇది వివరిస్తుంది. హైదరాబాద్ రాజ్య చరిత్రలో అధికారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఎన్నో దశాబ్దాల పాటు వేరువేరు రూపాలలో సాగించిన పోరాటాలకు ఒక రాజకీయ నిర్మాణ రూపం ఇచ్చే సమయం, అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెసు నాయకత్వం శషభిషలులేని నిర్మాణాత్మక వైఖరిని తీసుకోలేకపోయింది. ప్రజల కోరికను మన్నించి వారి ఉద్యమానికి ఒక సంస్థాగతరూపం ఇవ్వడానికి స్థానిక నాయకత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, స్వయంగా గాంధీతో సహా 'జాతీయ' నాయకత్వం వెనుకడుగు వేసింది. అలాగే ప్రజలు ఆంధ్ర మహాసభ కింద సంఘటితమై, వెట్టిచాకిరీ రద్దు, భూసంబంధాల మార్పు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి వంటి తమ మౌలిక ఆకాంక్షలను ప్రకటించడం మొదలు పెట్టినప్పుడు కాంగ్రెసు నాయకత్వం ఆ ఆకాంక్షలకు తాను దూరమని చాటుకుంది. ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉండి నాయకత్వం వహించమని పిలిచినప్పుడు కాంగ్రెసు ఇలా దూరం కాగా, కమ్యూనిస్టు పార్టీ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ అంశాలను అవగతం చేసుకోవడానికి చక్కగా దోహదపడేది ఈ పుస్తకం.

Browse more Telugu books