Hyderabad Karmikodyama Dasa, Disa Marchina COM N.V. BHASKARA RAO

Editor · Best Selling

Hyderabad Karmikodyama Dasa, Disa Marchina COM N.V. BHASKARA RAO book cover

Price: Rs. 365. భాస్కరరావు ఒక చిన్న తమ్ముడిగా మాకు రక్షణ ఏర్పాట్లు చేస్తూ, ఇతర నాయకులకు మాకు మధ్య సమాచారం అందిస్తూ ఉండేవాడు. పోలీసులకు చిక్కినా రహస్యాలు బయట పెట్టని ధీరుడుగా భాస్కరరావును మేము గుర్తించాం. మరణించే వరకు భాస్కరరావు మాకు, పార్టీకి కుడిభుజంగా ఉండేవాడు. ఎప్పటికైనా మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ సోషలిజాన్ని సాధించుకోవాలనుకుంటే ఎన్నికల్లో పాల్గొనడంతోపాటు ప్రతి ప్రజాసంఘం, కార్మిక, రైతాంగ, విద్యార్థి సంస్థల్లోను, ప్రతి ప్రభుత్వ విభాగాల్లోను కమ్యూనిస్టు పార్టీ పనిచేయాలి. అది లేనిదే విప్లవం రాదు. ప్రజాస్వామ్యం బతకదు. అమరవీరుల ఆశయాలను సాధిస్తామని అంటే దాని అర్థం ఇదే. ప్రాణాలైనా అర్పించి ఉక్కు శిక్షణగల వారిని ఎంత మందిని తయారు చేశామనేది ముఖ్యం. తమ విజయాలను, అనుభవాలను తీసుకుని యువతరం కార్యకర్తలు ఉద్యమాన్ని లోపాలు లేకుండా ముందుకు తీసుకుపోవాలి. యువతరం అలా పనిచేయడమే భాస్కరరావుకు నిజమయిన శ్రద్ధాంజలి ఘటించడం. ఇదే మన ముందున్న కర్తవ్యం.

Browse more Telugu books