Hyderabad

Editor · History

Hyderabad book cover

Price: Rs. 90. హైదరాబాద్ స్టేట్... భారతదేశ చరిత్రలో మహెూజ్వల ఘట్టాలకు కేంద్రబిందువుగా నిలిచిన మహా సంస్థానం. నియంతృత్వం, బానిసత్వం, అణచివేత, అవిద్య, వెనుకబాటుదనం, దోపిడీపాలన, విముక్తి ఉద్యమాలు, మత విద్వేషాలు, రక్తపుటేరులు, విశిష్ట సంస్కృతి, ఘనమైన వారసత్వ సంపద, మిశ్రమ జీవన సౌందర్యం, సాహిత్య, కళారంగాల వైభవం... ఇలా ఎన్నో పార్శ్వాలు ఉన్న హైదరాబాద్ స్టేట్ చరిత్ర ఎంతో విలక్షణమైనది. స్వాతంత్ర్యానికి పూర్వం హైదరాబాద్ సంస్థానంలో అవిచ్ఛిన్నంగా సాగిన దోపిడీ, దురంతాలపై విప్లవ కవి, కమ్యూనిస్టు అగ్రనాయకుడు మబ్లూం మొహియుద్దీన్ 'హైదరాబాద్' పేరుతో ఉర్దూలో ఒక పుస్తకం రచించారు. లాహెూర్లో ముద్రితమైన ఈ పుస్తకాన్ని నిజాం సర్కారు నిషేధించింది. ఆనాడు జాగీర్దార్లు, దేశముఖు, పారిశ్రామికవేత్తలు సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలు, లూటీని రచయిత దీనిలో బట్టబయలు చేశారు. నాటి హైదరాబాద్ స్టేట్లో నెలకొన్న పరిణామాలను ఒక కమ్యూనిస్టు దృక్పథంతో విశ్లేషిస్తూ మబ్లూం రచించిన పుస్తకానికి మెహక్ హైదరాబాదీ చేసిన అనువాదమిది.

Browse more Telugu books