Husband Stich-1
Editor · Women

Price: Rs. 180. గీతాంజలి రాసిన హస్బెండ్ స్టిచ్ కథల గురించి మాట్లాడడానికి, ఈ కథలను చదవడానికి ఒక కనీస అర్హత ఉండాలి. ఆ అర్హత పేరు మానవత్వం లేదా మనిషితనం. ఈ అర్హత ఉన్న వాళ్లకు ఈ కథలు ఒక రకంగానూ.. ఈ అర్హత లేనివాళ్లకు ఈ కథలు మరో రకంగానూ అర్ధం కావచ్చు. తెలుగు సాహిత్య లోకానికి, బహుశా భారతీయ సాహిత్య లోకానికి ఒక ఉలికిపాటును, ఒక కొత్త ఎరుకను, స్పృహను కలిగించి పెను నిద్దరను పదిలించే కథలివి. మతోన్మాదానికి, గ్లోబలైజేషన్కు, సెజ్లకు వ్యతిరేకంగా ముస్లిం స్త్రీల అస్తిత్వ సమస్యలు.. కన్నీళ్లని, సమస్త స్త్రీల సంవేదనల్ని, ప్రపంచీకరణ నేపథ్యంలో అతలాకుతలం అవుతున్న రైతుల జీవితాల్ని, వలసజీవుల వేదనల్ని, వర్తమాన వాస్తవ ప్రపంచాన్ని చాలా బలంగా తెలుగు కథా సాహిత్యంలో చిత్రీకరిస్తున్న గీతాంజలి రాసిన మరో కథా సంపుటి హస్బెండ్ స్టిచ్-1. మూసివున్న తలుపుల వెనకాల పెళ్లి అనే లైసెన్స్తో భార్యలపై భర్తలు చేసే అమానవీయ లైంగిక అత్యాచారాలను తీవ్రమైన కంఠంతో రాశారు. ఇప్పటికే ఇది పాఠకులను కలవరపెట్టి, అనేక మంది పాఠకులకి చేరువై అనేక చర్చలకి కారణమైంది. ఇప్పటిదాకా సమాజంలో చర్చకు నోచుకోని, సాహిత్యంలోకి బలంగా రాని కలవర పెట్టే స్త్రీలు అనుభవించే దారుణమైన సెక్స్ సమస్యలు కన్నీళ్లు పెట్టిస్తాయి. మనం మనుషులం కదా అని గుర్తు చేస్తాయి. నిజానికి ఈ కథలు చదవడం ఒక సాహసం.. బాధ్యతతో చదవాల్సిన కథలు ఇవి. వీటిని మన ఇంట్లో, వీధిలో, కార్యాలయాలలో, కళాశాలల్లో అందరిచేతా చదివించాలి. ఈ కథలు చదివాక ముందు మనం వేరు. చదివిన తరువాత మనం వేరు అని మనకే నిర్ధారణ అవుతుంది. వీటిని కథలని తక్కువ చేయలేం. వీటిని కావ్యాలనాలి మహా కావ్యాలకంటే ఈ కథలు తక్కువేమీ కావు. తెలుగు సాహిత్య విమర్శకులు తప్పకుండా చదివి, పరిశీలించి, పరిశోధించి, చర్చించి తెలుగు సాహిత్యంలో, భారతీయ సాహిత్యంలో ఈ కథలకు ఉండవలసిన స్థానం ఏమిటో తప్పకుండా నిర్ధారణ చేయవలసిన కథలివి. లేకపోతే అది ఒక సామాజిక తప్పిదం అవుతుంది. -పలమనేరు బాలాజీ సీనియర్ కవి, విమర్శకులు, కథా రచయిత ఇంటా బయటా భద్రత లేని స్త్రీల జీవితాల్లో అనునిత్యం చోటుచ