Hissa Ijjath Hukumath
Editor · Politics

Price: Rs. 199. బీదరికం నుంచి ఎదిగి బీసీ ఉద్యమానికి సారధిగా టి. చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. పదవి విరమణ తర్వాత విశ్రాంత జీవనం ఎన్నుకోక బీసీ ఉద్యమానికి సైద్దాంతిక పునాదులు వేస్తూ ఉద్యమకారునిగా ముందుకు సాగుతున్నాడు. పుట్టింది మోతే గ్రామము, వేల్పూరు మండలము, నిజామాబాద్ జిల్లా. తల్లి మల్లుబాయ్, తండ్రి తోగర్ల నరేష్ ముంబైలోని పవర్లూమ్లో పని చేసినాడు. సాధారణ చేనేత కుటుంబం. విద్యాభ్యాసం: స్వగ్రామంలో ఏడవ తరగతి వరకు, పక్కనే ఉన్న వేల్పూర్ గ్రామంలో 10వ తరగతి చదివినాడు. ఇంటర్ డిగ్రీ (B.Sc.-B.Z.C) జిల్లా కేంద్రం నిజామాబాదులో చదివి పీజీ ఎంఏ ఎడ్యుకేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదులో చేసినాడు. ఉద్యోగ బాధ్యతలు: 1983లో గ్రామ అభివృద్ధి అధికారిగా ప్రారంభించి మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాదులో 2021లో సంయుక్త డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. 1989లో గ్రూప్-2లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానంలో నిలిచి ఏసిటిఓ ఉద్యోగం సాధించారు. 1993లో గ్రూప్ - 1 లో 16వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపిక కాబడి 2002 ఐఏఎస్ బ్యాచ్ కు ప్రమోట్ కాబడ్డారు. ఉద్యోగ జీవితంలో రెవిన్యూ డివిజనల్ అధికారిగా కందుకూరు, ప్రకాశం జిల్లా, ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డిఏ వరంగల్ మరియు కరీంనగర్ జిల్లాలో పనిచేశారు. సంయుక్త కలెక్టర్‌గా అనంతపురం మరియు మహబూబ్ నగర్ జిల్లాల్లో పనిచేశారు, కలెక్టర్ నల్గొండ, డైరెక్టర్ పాఠశాల విద్య, చేనేత జౌళి శాఖ నిర్వహించారు. కమిషనర్ హెచ్ఎండిఏ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖలను సమర్ధవంతంగా నిర్వహించారు. అంతేగాక శాతవాహన, కాకతీయ విశ్వవిద్యాలయకు ఉపకులపతి బాధ్యతలు నిర్వహించారు. ఏ పదవి నిర్వహించిన ఆ పదవికి వన్నె తీసుకువచ్చారు. పిడిడిఆర్డీఏ వరంగల్ గా మహిళా స్వయం సహాయక సంఘాల నిర్మాణం మరియు బ్యాంకు లింకేజీలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపి నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ పిడిగా అవార్డు అందుకున్నారు. కరీంనగర్ పిడిడిఆర్డిఏ గా మార్కెటింగ్‌లో మహిళలకు శిక్షణ ఇచ్చి వారిచే మొక్కజ