HINDUTWA MATONMADAM
Editor · Politics

Price: Rs. 75. బిజెపి ప్రభుత్వ విధానాలు, సంఘ్ పరివార్ చర్యలు లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయాల పునాదులను ధ్వంసం చేస్తున్నాయి. సంఘపరివార్ శక్తుల విభజనవాద, ఫాసిస్టుతరహా చర్యలు శ్రామిక ప్రజల వర్గ ఐక్యతను, దేశసమగ్రతను దెబ్బతీస్తున్నాయి. రాజ్యవ్యవస్థపై పట్టు ద్వారాను, దేశ, విదేశీ కార్పొరేట్ల నుండి పుష్కలంగా సహాయం అందడంతోను సంఘపరివార్ శక్తులు మైనారిటీలకు వ్యతిరేకంగా దుష్ప్రచారానికి, మతోన్మాద చర్యలకు పాల్పడుతూ మత భావనలను రెచ్చగొట్ట కలుగుతున్నాయి. మైనారిటీలపై ద్వేషం అనేదాన్ని 'ఇంగిత జ్ఞానం'గా మార్చగలిగాయి. ఈ మతోన్మాద శక్తులను భౌతికంగాను, రాజకీయంగాను, భావజాలపరంగాను బలహీనపరచడం అనేది దేశంలోని లౌకిక శక్తులు ఎదుర్కొంటున్న బృహత్తర కర్తవ్యం.