Hindu's houses

Sundara Vardhan / సుందర వర్ధన్ · Politics

Hindu's houses book cover

Price: Rs. 45. మనిషి, ప్రకృతి జ్ఞానికి హిందూ నాగరికత అందించిందేమిటి? ప్రపంచంలో హిందూ లేదా వేద నాగరికత ప్రాచీన మైందని ప్రతి దేశభక్తి హిందూ ప్రగల్భాలు పలుకుతాడు. అనేకమంది ఆదిమ జీవనం సాగిస్తున్న చోట, నగ్నంగా సంచరింస్తున్నచోట భారతదేశం అత్యున్నత నాగరికత దశకు చేరుకున్నదని నిప్పులు చెరుగుతూ పదే పదే చెప్పటం, దురహంకారంతో గర్విచడం కూడా ఎవరైనా వినవచ్చు. ఈజిప్టు, బాబిలోనియా, జూడియా, రోమ్, గ్రీసు నాగరికతలు నాశనమవుతున్నప్పుడు హిందూ నాగరికత సజీవంగా ఉన్నదని అందుకు దాని వారసత్వ శక్తి కారణమని ఒక హిందువు చెప్పటం కూడా వినవచ్చు. అలాంటి దృష్టి ఒక అంశాన్ని జార విడవడాన్ని సమ్మతిస్తుంది. నాగరికత ప్రాచీనమైందా లేక మనగలిగిందా అన్నది మౌళిక అంశం కాదు. ఒకవేళ అది మనగలిగితే దేనిమీద? దాని విలువేమిటి? మరో విధంగా మౌళిక సవాల్ ఇది. ఈ హిందూ నాగరికత సామాజిక వారసత్వం లాభదాయకమైందా? గుదిబండా? తరగతులకు, వ్యక్తులకు విస్తరించడం వల్లనూ, ఎదగడం ద్వారానూ ఇదేమి అందివ్వనుంది?" - డా॥ బి. ఆర్. అంబేడ్కర్ ఈ పుస్తక అనువాదకులు సుందర వర్ధన్, జిలుకర శ్రీనివాస్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. సుందర వర్ధన్ క్లాసికల్ ఎకనామిక్స్లో ఎం.పిల్ చేస్తుండగా, శ్రీనివాస్ తెలుగులో పిహెచ్.డి చేస్తున్నారు.

Browse more Telugu books