Hindu Thathvashastram series 9

Editor · History

Hindu Thathvashastram series 9 book cover

Price: Rs. 165. భారతీయ ఆలోచనా ధార, దార్శనికతల్లో నిష్ణాతులైన పండితులే కాకుండా, ప్రపంచస్థాయి చట్టనిర్మాతలు, న్యాయకోవిదులు, తత్వవేత్తల్లోనూ బి.ఆర్. అంబేడ్కర్ సర్వోతృష్ట స్థానాన్ని అధిష్ఠించారు. ధర్మ శాస్త్రాలను, ఇతరత్రా ప్రపంచ మతాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా విభిన్న నాగరికతలను సునిశితంగా పరిశీలించడం ద్వారా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సాధించిన గంభీరమైన పాండిత్యము, జ్ఞానము ఆయన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా వ్యక్త మవుతున్నాయి. అవి మనందరికీ మార్గదర్శాకాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న అనేక సామాజిక చిక్కు సమస్యలకు అంబేడ్కర్ అందించిన విప్లవాత్మక, మానవీయ వైఖరితో కూడిన పరిష్కారానికిగాను ఇండియన్ సమాజం ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటుంది. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, విశ్వజనీన సౌభ్రాతృత్వం అనే నియమాల పునాదిగా కొత్త సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆయన జీవితకాలం కృషి చేసారు.

Browse more Telugu books