Hindu Samrajyavadha Charithra
Editor · History

Price: Rs. 90. 72 సంవత్సరాల క్రితం యీ పుస్తకం బయటికి వచ్చినప్పుడు దేశం నలుమూలల నుండీ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అందులో కొన్ని..... ఈ పుస్తకాన్ని గురించి........ యీ పుస్తకాన్ని నాకిష్టమైన దృష్టికోణం నుండి రాశారు. నేను కూడా యీ అంశంపైన ఒక పుస్తకాన్ని రాస్తున్నాను. నేననుకున్న విషయాలు ఎన్నోయీ పుస్తకంలో చర్చించారు. అందుకని యీ పుస్తకం ఎంతగానో ఆహ్వానించదగినది. - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అసాధారణమైన యీ పుస్తకం ఎంతో సాహసంతో, ఎంతో స్వేచ్ఛతో రాసిందని చెప్పడానికి నేను వెనుకాడను. యీ పుస్తక ప్రచురణను నేను మనసారా ఆహ్వానిస్తున్నాను. -సర్ తేజ్ బహదూర్ సప్రూ "హిందూ సామ్రాజ్యవాద చరిత్ర" నిర్భయంగా చేసిన ఒకానొక పరిశీలన. మిగతా సమాజం యావత్తూ స్వేచ్ఛ కోసం పెనుగులాడుతుంటే బ్రాహ్మణులు ప్రతిచోటా ఆ ప్రయత్నాలకు అవరోధాలుగానే వున్నారు. - అమృతబజార్ పత్రిక యీ అమూల్యమైన రచనను ఎంతో సునిశితంగా, జాగ్రత్తగా పరిశీలించమని ఎంతో విశ్వాసంతో సిఫారసు చేస్తున్నాము. యిది ప్రతి భారతీయుడికీ ఎంతో ముఖ్యమైనది - కలకత్తా రివ్యూ నిష్పక్షపాతంగా వుండే ప్రతిదేశ భక్తుడూ చదవవలసిన పుస్తకం యిది. చదివి జీర్ణం చేసుకోవాలి. హిందూ సామ్రాజ్యవాదం పైన తిరుగుబాటు రావాల్సిన అవసరం భారత ప్రజాస్వామ్యానికి ఎంతో వుంది. - గార్డియన్, మద్రాసు భారత దేశంలో అత్యంత ముఖ్యమైన గ్రంథాల్లో యిది ఒకటి ట్రిబ్యూన్, లాహోర్ సమకాలీన సామాజిక ఆర్థిక సాహిత్యానికి సంబంధము హిందూ సామ్రాజ్యవాద చరిత్ర' అత్యద్భుతమైన, శక్తివంతమైన కృషి. ఆల్ ఇండియా బుక్ వీక్లీ యీ పుస్తకాన్ని ఎంతో పదునైన శైలిలో రాశారు. -లీడర్, అలహాబాద్ యీ పుస్తకం చదువరులను ఉత్తేజపరుస్తుంది. ఉద్విగ్నులను చేస్తుంది. తీక్షణంగా ఆలోచించేందుకు ప్రేరేపిస్తుంది. -అబ్జర్వర్, కటక్