HINDU RASHTRA ANTE EMITI?
Editor · Politics

Price: Rs. 25. 'హిందూ రాష్ట్ర అంటే ఏమిటి?' అనే ఈ రచన, వందేండ్లు హిందూత్వ మతతత్వ రాజకీయాలకు సైద్ధాంతిక పునాదిని నమకూర్చిన గోల్వాల్కర్ రాసిన 'మనం - మన జాతీయ నిర్వచనం'లోని విషయాలను బయట పెడుతుంది. మార్క్సిస్టు యోధుడు అమరజీవి సీతారాం ఏచూరి, ఆ చిన్న పుస్తకంలోని విషయాలను, హిందూత్వ ఆలోచనలను సవివరంగా చెప్పిన పుస్తకం ఇది. ఫాసిస్టు హిట్లర్ ఆలోచనల ఆధారంగా గోల్వాల్కర్ ఎలాంటి విశ్లేషణలు భారతీయ సమాజం పట్ల చేశాడో తెలుసుకోవచ్చు. భారత జాతీయతను నిర్వచించిన తీరు, దేశ ప్రజలు వెనుకబడి పోవటానికి కారకులుగా ముస్లింలను శత్రువులుగా ఎంచిన విద్వేష విధానం, దాని కొనసాగింపూ స్పష్టంగా తెలియపరుస్తారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్