Hindhuthva Punaragamanam

Editor · History

Hindhuthva Punaragamanam book cover

Price: Rs. 160. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశం '2014 నుండి తప్పుడు మార్గం పట్టడం' చాలా ఆందోళన కలిగించే అంశం (అమర్త్య సేన్). ఎన్నడూ పెద్దగా మాట్లాడని శాస్త్రవేత్తలు కూడా ఈ పరిణామాలకు హతాశులై 'మనల్ని విభజించే, భయాన్ని సృష్టించే, మన సమాజంలోని పెద్ద సెక్షన్ను వేరుచేసే' రాజకీయాలను తిరస్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. 'భిన్నత్వం అనేది మన ప్రజాస్వామ్యానికి అతి పెద్ద బలం. వివక్ష, అందరినీ భాగస్వాములను చేసుకోకపోవడం అనేది మన పునాదులనే బలహీనపరుస్తుంది' అని వారు పేర్కొనాల్సి వచ్చింది. మెజారిటేరియనిజం మరింత బలపడుతుందా లేక మరింత భాగస్వామ్య సమాజంలో, విద్వేషాలు లేని సమాజంలో సమానత్వంతో కూడిన జీవితాన్ని అనుభవించాలన్న సామాన్యుల కల నెరవేరుతుందా? ఆశ్రిత పెట్టుబడిదారులకూ, డబ్బు సంచులకూ పగ్గాలు వదిలే కాలం అంతమై సంపద పునఃపంపిణీ తిరిగి మొదలవుతుందా? సుభాష్ గటాడే (1957లో పుట్టారు) వామపక్ష పాత్రికేయుడు, రచయిత, అనువాదకుడు. వారణాసి, బిహెచ్ యు-ఐటిలో ఎం.టెక్. (మెకానికల్ ఇంజనీరింగ్ 1981) చేశారు. ఆయన ఇటీవల రాసిన పుస్తకాలు: 'మోడీనామా' (లెఫ్ట్ వర్డ్, 2019), 'చార్వాక్ కె వారిస్' (హింది, 2018), 'అంబేద్కర్ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్' (మరాఠీ 2016) 'బీసవి సాది మే అంబేద్కర్ కా సవాల్' (హింది, 2014), 'గాడ్సే కి ఔలాద్' (ఉర్దు 2013) ‘గాడ్సే చిల్డ్రన్-హిందూత్వ టెర్రర్ ఇన్ ఇండియా' (2011), 'ది సాఫ్టన్ కండిషన్' (2011) ఆయన అప్పుడప్పుడు పిల్లల రచనలు చేస్తుంటారు: పహాడ్ సె ఊంచా ఆద్మీ (ఎన్సిఇఆర్, హింది, 2010)

Browse more Telugu books